News July 8, 2025
సోషల్ మీడియా స్నేహితులను నమ్ముతున్నారా?

TG: సోషల్ మీడియాలో పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచించారు. అందమైన ప్రొఫైల్స్ చూసి, వారిని నమ్మి పెట్టుబడులు పెట్టొద్దని Xలో తెలిపారు. గోల్డ్, ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ వంటి వాటిలో రూ.లక్షలు సంపాదించవచ్చనే మాటల్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే మోసపోతారన్నారు. పెట్టుబడి అనేది కీలకమని, అపరిచితుల్ని నమ్మి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సున్నితంగా హెచ్చరించారు.
Similar News
News July 8, 2025
సీఎంఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల

కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్(CMA) ఫౌండేషన్ పరీక్షల <
News July 8, 2025
బికినీలో స్టార్ హీరోయిన్.. ఫొటోలు వైరల్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బీచ్ వద్ద బికినీలో ఉన్న ఫొటోలను కరీనా ఇన్‌స్టాలో షేర్ చేశారు. షూటింగ్ కోసమా లేదా ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లారా అనేది వెల్లడించలేదు. కాగా 44 ఏళ్ల వయసులో ఆమె ఫిట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
News July 8, 2025
ఈ నెల 13 వరకే ఫిర్యాదులకు అవకాశం

AP: అన్నదాత సుఖీభవ-PM కిసాన్‌కు సంబంధించి అర్హుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. జాబితాలో పేరు లేనివారు రైతు సేవా కేంద్రంలో అర్జీలు అందజేయొచ్చని, అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోని గ్రీవెన్స్ మాడ్యూల్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. అందుకు ఈ నెల 13వరకే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ పథకం కింద ఈ నెలలోనే రూ.7వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.