News March 31, 2024

మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా?

image

రేపటి నుంచి క్రెడిట్ కార్డుల విషయంలో పలు మార్పులు రానున్నాయి.
★ అద్దె చెల్లింపులపై SBI కార్డు రివార్డ్ పాయింట్లు నిలిచిపోనున్నాయి.
★ బీమా, గోల్డ్‌, ఫ్యూయల్‌ కోసం AXIS క్రెడిట్‌ కార్డు ద్వారా జరిపే చెల్లింపులపై రివార్డ్‌ పాయింట్లు లభించవు. ఎయిర్‌పోర్టు లాంజ్ యాక్సెస్ పొందాలంటే 3నెలల్లో ₹50వేలు ఖర్చు చేయాలి.
★ ICICI లాంజ్ యాక్సెస్ పొందాలంటే 3నెలల్లో కనీసం ₹35వేలు, YES కార్డుపై ₹10వేలు ఖర్చు చేయాలి.

Similar News

News October 6, 2024

ఇవాళ పాకిస్థాన్‌తో భారత్ పోరు

image

ఇవాళ మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరు జరగనుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. తొలి మ్యాచులో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమితో భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారీ విజయం నమోదు చేయాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 15 టీ20లు జరగ్గా భారత్ 12, పాక్ 3 మ్యాచుల్లో విజయం సాధించాయి. కాగా మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

News October 6, 2024

నేడు సింహవాహనంపై ఊరేగనున్న స్వామివారు

image

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజైన ఇవాళ ఉ.8 నుంచి 10 గంటల వరకు స్వామివారు సింహవాహనంపై ఊరేగుతారు. రా.7 నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంలో వేణుగోపాలుడి అలంకారంలో ఊరేగనున్నారు.

News October 6, 2024

మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే

image

ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. నవంబర్ 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29, డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నాయన్నారు. ఈ సుముహూర్తాల్లో దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని, దాదాపు రూ.6 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నారని CAIT అంచనా వేస్తోంది.