News March 25, 2025

అల్యూమినియం పాత్రలు వాడుతున్నారా?

image

అల్యూమినియం పాత్రలను వాడటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘అల్యూమినియం ఆహారం, నీటిలో సహజంగా ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల న్యూరో టాక్సిక్ ప్రభావాలను కలిగించవచ్చు. కొన్నిసార్లు ఇది క్యాన్సర్‌కు దారితీస్తుంది. అధిక వేడి వద్ద ఇది ఆహారంలో కలవొచ్చు. ఈ అధిక అల్యూమినియం ఎముకలు, లివర్, కిడ్నీలను ప్రభావితం చేయొచ్చు. అందుకే స్టీల్, కాస్ట్ ఐరన్ పాత్రలను వాడితే బెటర్’ అని తెలిపారు.

Similar News

News November 10, 2025

ఆరికకు చిత్త గండం, ఆడదానికి పిల్ల గండం

image

ఆరిక(ఒక రకమైన చిరుధాన్యం) పండాలంటే, అవి పక్వానికి వచ్చే సమయంలో చిత్తా నక్షత్రం ప్రవేశంలో వర్షాలు బాగా కురవాలి. అప్పుడు వర్షాలు లేకుంటే పంట నాశనమవుతుంది. అందుకే ఆరిక పంటకు ఆ సమయం గండం వంటిది. అలాగే ఒక స్త్రీ జీవితంలో ప్రసవం అత్యంత కీలకమైన, ప్రమాదకరమైన ఘట్టం. దానినే పిల్ల గండంగా పేర్కొన్నారు. జీవితంలో కొన్ని దశలలో కొన్ని విషయాలకు సహజంగానే పెద్ద సవాళ్లు ఎదురవుతాయని ఈ సామెత తెలియజేస్తుంది.

News November 10, 2025

పాప నివారణ కోసం చదవాల్సిన శివ మంత్రం

image

క‌రచరణా కృతం వా కాయ‌జం క‌ర్మజం వా
శ్రవ‌న్నయ‌న‌జం వా మాన‌సం వా
ప‌ర‌ధాం విహితం విహితం వా
స‌ర్వ మేత‌త క్షమ‌స్వ
జ‌య జ‌య క‌రుణాబ్దే శ్రీ మ‌హ‌దేవ్ శంభో
చేతులు, కాళ్లు, మాటలు, చెవులు, కళ్లు, పనులు, మనస్సు.. వీటి ద్వారా తెలిసో, తెలియకో మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఆ అన్నీ తప్పులకు క్షమాపణ కోరుతూ, పరమేశ్వరుడిని ప్రార్థిస్తే.. వాటి ద్వారా వచ్చే దోషాలను ఈశ్వరుడు రాకుండా ఆపుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News November 10, 2025

ఫెదరర్ రికార్డును దాటేసిన జకోవిచ్

image

టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ సంచలనం సృష్టించారు. ఏథెన్స్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచి కెరీర్‌లో 101వ సింగిల్స్ టైటిల్ అందుకున్నారు. ఇటలీ ప్లేయర్ ముసెట్టితో జరిగిన ఫైనల్లో 4-6, 6-3, 7-5 తేడాతో విజయం సాధించారు. దీంతో హార్డ్ కోర్టులపై జకోవిచ్ సాధించిన టైటిల్స్ సంఖ్య 72కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో ఇదే అత్యధికం. తర్వాతి స్థానంలో ఫెదరర్(71) ఉన్నారు.