News October 23, 2025

బాడీలోషన్నే ముఖానికి వాడుతున్నారా?

image

చర్మానికి తేమను అందించడానికి చాలామంది బాడీలోషన్ వాడుతుంటారు. కానీ కొంతమంది ఈ లోషన్నే ఫేస్​కి కూడా వాడుతుంటారు. దీనివల్ల ముఖంపై మొటిమలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇందులో వాడే కృత్రిమ పరిమళాలు మృదువుగా ఉండే ముఖ చర్మంపై అలర్జీలు రావడానికి కారణం అవుతుందంటున్నారు. కాబట్టి ముఖం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.

Similar News

News October 23, 2025

వరుసగా డకౌట్లు.. కోహ్లీ కెరీర్‌లో తొలిసారి

image

లాంగ్ గ్యాప్ తర్వాత వన్డే సిరీస్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డపై ఫెయిల్ అవుతున్నారు. వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ అయ్యారు. తన కెరీర్‌లో ఇలా వరుస ODIల్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి. దీంతో విరాట్‌కు ఏమైందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. రన్ మెషీన్ తిరిగి ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నారు.

News October 23, 2025

రాష్ట్రానికి తుఫాను/వాయుగుండం ముప్పు?

image

AP: అక్టోబర్ 27 నుంచి 30 మధ్యలో తుఫాను లేదా వాయుగుండం కావలి-మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తా అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. అటు ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.

News October 23, 2025

ధాన్యం కొనుగోళ్లకు మార్గదర్శకాలు జారీ

image

AP: 51 లక్షల టన్నుల ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. రైతులకు నూటికి నూరుశాతం మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఈ-పంట డేటా ప్రకారం ముందే ధాన్యం కొనుగోలు చేయాలని నిర్దేశించింది. ఏ మిల్లుకు ధాన్యం పంపాలనే స్వేచ్ఛను రైతులకు కల్పించింది. ఖరీఫ్ ధాన్యం క్వింటాకు సాధారణ రకానికి రూ.2369, గ్రేడ్-A రకానికి రూ.2,389 మద్దతు ధర కల్పించింది.