News May 7, 2025

సువాసన కోసం పర్‌ఫ్యూమ్ వాడుతున్నారా?

image

శరీరం నుంచి సువాసన వచ్చేందుకు చాలా మంది పర్‌ఫ్యూమ్ వాడుతుంటారు. దీనిని ఎక్కువగా వాడితే అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పర్‌ఫ్యూమ్స్‌లో ఉపయోగించే థాలేట్స్, సింథటిక్ సువాసనలు శరీరానికి హాని కలిగిస్తాయి. వీటి వల్ల చర్మంపై అలర్జీ, దద్దుర్లు వస్తాయి. పదేపదే వీటిని ఉపయోగిస్తే రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Similar News

News March 13, 2026

పశ్చిమాసియాలో పరిస్థితులపై ఇరాన్ ప్రెసిడెంట్‌తో మోదీ చర్చలు

image

పశ్చిమాసియాలో పరిస్థితులపై ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్‌తో చర్చించినట్లు PM మోదీ ట్వీట్ చేశారు. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణనష్టం, మౌలిక సదుపాయాల ధ్వంసంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత పౌరుల భద్రత, అడ్డంకులు లేని ఇంధన సరఫరా తమకు అత్యంత ప్రాధాన్యత అంశాలని మోదీ స్పష్టం చేశారు. భారత్ ఎల్లప్పుడూ శాంతికి కట్టుబడి ఉంటుందని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని పెజెష్కియాన్‌‌ను కోరారు.

News March 13, 2026

TODAY HEADLINES

image

*LPGపై ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నారు: మోదీ
*దేశంలో గ్యాస్ లభ్యతపై ఆందోళన నెలకొంది: రాహుల్
*పారిశ్రామిక హబ్‌గా ఏపీ: చంద్రబాబు
*నర్సరీ నుంచి 12వ తరగతి విధానం తీసుకొస్తాం: రేవంత్
*TG: ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు
*16న విచారణకు హాజరు కావాలని కవితకు సీబీఐ నోటీసులు
*US నౌకపై ఇరాన్ దాడి.. ఇండియన్ మృతి
*గ్యాస్ కొరత నేపథ్యంలో రాష్ట్రాలకు కిరోసిన్ సరఫరా పెంపు

News March 13, 2026

వార్ ఎఫెక్ట్.. కేంద్రానికి భారంగా ఫర్టిలైజర్ సబ్సిడీ!

image

ఇరాన్ యుద్ధంతో చమురు ధరలు పెరగడం, సరఫరాలో అంతరాయాల కారణంగా ఎరువుల సబ్సిడీ ఖర్చు కేంద్రానికి భారంగా మారనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ సబ్సిడీల బడ్జెట్ అంచనా ₹1.7లక్షల కోట్లు కాగా ఇప్పుడది ₹2.2 లక్షల కోట్లకు చేరొచ్చని కేంద్రవర్గాల సమాచారం. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం ₹1.71లక్షల కోట్లలో ఫర్టిలైజర్ సబ్సిడీకి ₹1.16లక్షల కోట్లు, నాన్-యూరియా ఫర్టిలైజర్స్‌కు ₹54వేల కోట్లను కేంద్రం కేటాయించింది.