News March 18, 2024
ఛార్జింగ్ కేబుల్కు టేప్ అంటించి వాడుతున్నారా?
చాలామంది ఛార్జింగ్ కేబుల్ పాడై, వైర్లు బయటికి వచ్చినా టేపు అంటించి వాడుతుంటారు. అలా చేయడం ప్రమాదమని UKలోని ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇనిస్టిట్యూట్ పరిశోధనల్లో తేలింది. తాత్కాలికంగా రిపేర్ చేసిన ఛార్జర్లు వాడితే ఫోన్ పేలిపోవడంతో పాటు మనకు షాక్ కొట్టే ప్రమాదం ఉందట. ఇలాంటి ఘటనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించింది. నకిలీ/తక్కువ నాణ్యత ఉన్న ఛార్జర్లు కూడా వాడటం మంచిది కాదని తెలిపింది.
Similar News
News December 28, 2024
వాచ్మెన్కు జాక్పాట్.. లాటరీలో రూ.2.32కోట్లు
దుబాయ్లో వాచ్మెన్గా పనిచేస్తున్న HYDకు చెందిన రాజమల్లయ్య(60)కు జాక్పాట్ తగిలింది. ఇటీవల ప్రకటించిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రాలో ఆయన మిలియన్ దిర్హామ్స్(రూ.2.32 కోట్లు) గెలుచుకున్నారు. దీంతో మల్లయ్య సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తాను 30ఏళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నానని, ఇప్పుడు అదృష్టం వరించిందని తెలిపారు. ఈ మొత్తాన్ని కుటుంబం, స్నేహితులతో పంచుకుంటానని తెలిపారు.
News December 28, 2024
దటీజ్ మన్మోహన్: ఆపరేషన్ తర్వాత తొలి ప్రశ్న.. ‘నా దేశం ఎలా ఉంది?’
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా 2009లో హార్ట్ సర్జరీ జరిగింది. 11 గంటల శస్త్రచికిత్స తర్వాత బ్రీతింగ్ పైప్ తీసేయగానే ఆయన తన ఆరోగ్యం గురించి కాకుండా దేశం ఎలా ఉంది? కశ్మీర్ ఎలా ఉంది? అని అడిగారు. తన ధ్యాసంతా సర్జరీపై కాకుండా దేశంపైనే ఉందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆయనకు సర్జరీ చేసిన డాక్టర్ రమాకాంత్ పాండా ఓ సందర్భంలో వెల్లడించారు. మన్మోహన్ మానసికంగా చాలా బలంగా ఉండేవారని తెలిపారు.
News December 28, 2024
దివ్యాంగులకు షాక్.. సదరం సర్టిఫికెట్ల జారీ నిలిపివేత
AP: సామాజిక పింఛన్ల తనిఖీ పూర్తయ్యే వరకు దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు నిరాశ ఎదురుకానుంది. పింఛన్దారులలో అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జనవరి నుంచి మే వరకు పింఛన్ల తనిఖీ చేయనున్నట్లు సమాచారం. తొలుత రూ.15వేలు అందుకునే లబ్ధిదారులకు పరీక్షలు నిర్వహిస్తారట.