News March 4, 2025

ఉద్యోగులను రోబోలనుకున్నారా?: అఖిలేశ్

image

యువత, ఉద్యోగులు వారానికి 70-90 గంటల పాటు <<15638083>>పనిచేయాలని <<>>కోరుతున్న పారిశ్రామికవేత్తలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఉద్యోగులను రోబోలుగా భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. పనిలో నాణ్యత ముఖ్యమని పేర్కొన్నారు. ఎక్కువ గంటలు పనిచేయాలంటున్న వారు యువకులుగా ఉన్నప్పుడు అన్ని గంటలు పనిచేశారా? అని నిలదీశారు. పని గంటల పొడిగింపుతో కలిగే ఆర్థిక ప్రగతి సామాన్యులకు ఏం ఒరగబెడుతుందని ప్రశ్నించారు.

Similar News

News October 17, 2025

మరోసారి బ్యాంకుల విలీనం!

image

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో(PSB) మరో మెగా విలీనానికి రంగం సిద్ధమవుతోంది. చిన్న బ్యాంకులైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రను SBI, PNB, BOBలో విలీనం చేసే ఫైల్ త్వరలో PM కార్యాలయానికి చేరనుంది. దీంతో PSBల సంఖ్య 8 కానుంది. ఆర్థిక సంస్కరణలు, ఫిన్‌టెక్ కంపెనీలు, ప్రైవేటు బ్యాంకుల పోటీని తట్టుకోవడానికి ఈ విలీనం తప్పనిసరని కేంద్రం భావిస్తోంది.

News October 17, 2025

లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత ఆశన్న

image

మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురు‌దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ ఎదుట ఆ పార్టీ అగ్రనేత ఆశన్న(తక్కెళ్లపల్లి వాసుదేవరావు) లొంగిపోయారు. ఆయన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అటు బస్తర్ జిల్లా జగదల్‌పుర్‌లో 208 మంది మావోయిస్టులు సైతం అస్త్ర సన్యాసం చేశారు. వారిలో 98 మంది పురుషులు, 110 మంది మహిళలు ఉన్నారు. వారి వద్ద ఉన్న 153 తుపాకులు, 11 గ్రానైడ్ లాంచర్లను అప్పగించారు.

News October 17, 2025

ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్‌లో ఉద్యోగాలు

image

అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ 30 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ -బీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. వెబ్‌సైట్: https://www.prl.res.in/