News December 9, 2024
నా ఆనవాళ్లు చెరపాలనుకుంటారా?: KCR

TG: రాజకీయ స్వార్థం, తనపై కక్షతో కాంగ్రెస్ నేతలు పిచ్చిపనులకు పూనుకోవడం శోచనీయమని BRS అధినేత KCR అన్నారు. ‘నా ఆనవాళ్లు లేకుండా చేయాలనే మూర్ఖపుతనంతో సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు. రేపటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించడం వెనక అసలు కోణం, ఉద్దేశం ఏదైనా వచ్చిన వారిని గౌరవించా. భోజనం పెట్టా. యాదాద్రి పవర్ ప్లాంట్‌కు నేను పునాది వేయలేదా? రైతుబంధు ప్రారంభించలేదా?’ అని ఆయన ప్రశ్నించారు.
Similar News
News November 25, 2025
నవంబర్ నారీమణులదే

ఈ నెలలో భారత నారీమణులు ప్రపంచ వేదికలపై అదరగొట్టారు. ఈ నెల 2న భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలవగా, 23న అంధుల మహిళల టీమ్ టీ20 వరల్డ్ కప్ నెగ్గింది. నిన్న ఉమెన్ ఇన్ బ్లూ కబడ్డీ వరల్డ్ కప్ సొంతం చేసుకున్నారు. ఈ విజయాలు క్రీడల్లో మహిళలను ప్రోత్సహించేందుకు మరింత ఉపయోగపడుతాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. నవంబర్ నెలలో మహిళలు డామినేట్ చేశారని పలువురు పోస్టులు చేస్తున్నారు.
News November 25, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,910 పెరిగి రూ.1,27,040కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,750 ఎగబాకి రూ.1,16,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ. 1,74,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 25, 2025
గ్యాస్ లీకైనపుడు ఏం చేయాలంటే?

ఇంట్లో గ్యాస్ సిలిండర్, స్టవ్ లీకేజీ, నిర్వహణ లోపాలతో ప్రమాదాలు జరిగి తీవ్ర విషాదాలను మిగులుస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. గ్యాస్ లీకై దాన్ని అదుపు చేయలేకపోతే కిటికీలు, తలుపులు తెరవాలి. మంటలు చెలరేగితే మందపాటి దుప్పటి కప్పి ఆర్పేయాలి. రెగ్యులేటర్‌ను ఆపేయాలి. సిలిండర్ దగ్గర మంటలు చెలరేగితే తడిగా ఉండే గోనెసంచి/ వస్త్రాన్ని వేయాలి. అగ్నిమాపక శాఖ టోల్‌ఫ్రీ నంబరు 101కు సమాచారం ఇవ్వాలి.


