News March 17, 2024
వాళ్లను రాళ్లతో కొట్టించమంటారా?: CM రేవంత్
TG: గత పాలకులు చేసిన తప్పులకు ఎలాంటి శిక్షలుంటాయని ఎదురైన ప్రశ్నకు సీఎం రేవంత్ స్పందించారు. ‘ఓటమే వారికి పెద్ద శిక్ష. ఆ దెబ్బకు కిందపడి విరగడం కూడా మీరు చూశారు. అంతకంటే పెద్దశిక్ష ఏం ఉంటుంది. ఇంకా బలమైన శిక్షలేమైనా ఉంటే మీరే(రిపోర్టర్) సూచించాలి. అమరవీరుల స్తూపం వద్ద రాళ్లతో కొట్టించమంటారా?. మీ సూచనను ప్రభుత్వం పరిశీలిస్తుంది(నవ్వుతూ)’ అని రేవంత్ అన్నారు.
Similar News
News December 23, 2024
రాష్ట్రంలో మరిన్ని సంతాన సాఫల్య కేంద్రాలు
TG: సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే HYDలోని గాంధీ, పేట్ల బురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్ కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం మరిన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వరంగల్ ఎంజీఎంలో ఏర్పాటుకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. HYD, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, MBNRలోనూ ఏర్పాటు చేయనుంది.
News December 23, 2024
కులాంతర వివాహం చేసుకుంటే రూ.2.5లక్షలు.. వివరాలివే
TG: కులాంతర వివాహం చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్’ కింద రూ.2.5 లక్షల ఆర్థికసాయం అందిస్తోంది. వధూవరులు TG వాసులై, ఇద్దరిలో ఒకరు కచ్చితంగా ఎస్సీ వారై ఉండాలి. అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు పూర్తై ఉండాలి. పెళ్లైన ఏడాదిలోపే అప్లై చేసుకోవాలి. తొలి వివాహానికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం ఇక్కడ <
News December 23, 2024
పరవాడ ఫార్మా సిటీలో ప్రమాదం
AP: అనకాపల్లి జిల్లా ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. రక్షిత డ్రగ్స్లో విషవాయువు లీక్ కావడంతో ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురి కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు.