News February 8, 2025
ఉదయం లేవగానే రీల్స్ చూస్తున్నారా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738910051206_746-normal-WIFI.webp)
ఉదయం లేవగానే మొబైల్ పట్టుకుని రీల్స్ చూస్తే కార్టిసాల్ హార్మోన్ పీక్స్‌కి వెళ్లిపోయి రోజంతా స్ట్రెస్ ఫీలవుతారని డాక్టర్లు చెబుతున్నారు. దానికి బదులు సూర్యరశ్మి పడే ప్రదేశంలో కాసేపు నిల్చొని డే స్టార్ట్ చేస్తే చికాకు, స్ట్రెస్ దూరమవుతుందని అంటున్నారు. సాయంత్రం కూడా ఆఫీస్ నుంచి రాగానే టీవీలో గొడవలు పడే న్యూస్ చూసేబదులు పిల్లలు, కుటుంబంతో సరదాగా మాట్లాడుకుంటే ప్రశాంతంగా ఉంటుందని సూచిస్తున్నారు.
Similar News
News February 8, 2025
వరకట్నం కేసుల్లో కుటుంబం మొత్తాన్ని చేర్చడం తప్పు: సుప్రీం కోర్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738972930111_1045-normal-WIFI.webp)
వరకట్నం కేసుల్లో భర్త కుటుంబాన్ని నిందితులుగా చేర్చడం సరికాదని సుప్రీం కోర్టు తాజాగా అభిప్రాయపడింది. స్పష్టమైన ఆరోపణలుంటేనే వారిపై కేసు పెట్టాలని పేర్కొంది. ‘వైవాహిక వివాదాలు సాధారణంగా భార్యాభర్తల మధ్య భావోద్వేగాల కారణంగానే తలెత్తుతాయి. భర్త మీద కోపాన్ని అతడి కుటుంబీకులపై చూపించి కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. అలా అందర్నీ ఇరికించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే’ అని ఓ కేసు విచారణలో తేల్చిచెప్పింది.
News February 8, 2025
10 నుంచి బోదకాలపై స్పెషల్ డ్రైవ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738965214654_695-normal-WIFI.webp)
ఫైలిరియాసిస్(బోదకాలు) నివారణకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 10న స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించనుంది. ఏపీ సహా 13 రాష్ట్రాల్లోని 111 జిల్లాల్లో 2 వారాలపాటు కొనసాగనుంది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటికే వచ్చి ఉచితంగా ఔషధాలు అందిస్తారని, తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. క్యూలెక్స్ దోమల కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీనివల్ల కాళ్లతోపాటు ఇతర శరీర భాగాలు విపరీతంగా వాపునకు గురవుతాయి.
News February 8, 2025
మాజీ మంత్రి రజినీపై అట్రాసిటీ కేసు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738968834281_695-normal-WIFI.webp)
AP: మాజీ మంత్రి విడదల రజినీపై చిలకలూరిపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. 2019లో సోషల్ మీడియాలో రజినీపై పోస్టు పెట్టినందుకు తనను సీఐ సూర్యనారాయణ ద్వారా హింసించారని పిల్లి కోటి అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో రజినీ, ఆమె పీఏలతోపాటు అప్పటి సీఐపై కేసు నమోదైంది.