News August 14, 2024

ఇద్దరు పేషెంట్లపై అత్యాచారం.. డాక్టర్ అరెస్ట్

image

కోల్‌కతాలో లేడీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం దేశం మొత్తాన్ని అట్టుడికిస్తుంటే మరోవైపు ఒడిశాలో ఓ డాక్టర్ ఇద్దరు పేషెంట్లపై అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. ఠాకూర్ దిల్బాగ్ సింగ్ కటక్‌లోని SCB ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌. Aug 9న ఇద్దరు మహిళలు గుండె సమస్యలతో ఆసుపత్రికి రాగా Aug 11న వాళ్లను మళ్లీ రమ్మన్నారు. ఒకరి తర్వాత ఒకరిపై అత్యాచారం చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Similar News

News January 20, 2025

TODAY HEADLINES

image

✒ ఖోఖో తొలి వరల్డ్ కప్.. విజేతగా భారత్
✒ బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం
✒ AP: 2028కి రాష్ట్రమంతా పోలవరం నీళ్లు: అమిత్ షా
✒ APకి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది: సీఎం
✒ APలోనే తొలిసారి గుంటూరులో ‘కొకైన్’ కలకలం
✒ లోకేశ్‌ను Dy.CM చేయడానికి షా ఒప్పుకోలేదు: అంబటి
✒ TGలో కాపిటా ల్యాండ్ ₹450 కోట్ల పెట్టుబడులు: CMO
✒ రేషన్ కార్డు రూల్స్‌లో మార్పులు చేయాలి: హరీశ్
✒ వచ్చే నెల 12 నుంచి మినీ మేడారం

News January 20, 2025

మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం.. యోగికి మోదీ ఫోన్

image

మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు సంఘటనా స్థలాన్ని యోగి పరిశీలించారు. పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అగ్నిమాపక అధికారులు ఆయనకు తెలియజేశారు. కాగా సిలిండర్ పేలుడు వల్లే మంటలు చెలరేగినట్లు గుర్తించారు.

News January 20, 2025

పని నాణ్యతే ముఖ్యం: భారత్ పే సీఈఓ

image

వారంలో 90 గంటలు పనిచేయడమనేది చాలా కష్టమని భారత్ పే CEO నలిన్ నెగీ తెలిపారు. వర్క్ అవర్స్ కంటే ఎంత నాణ్యతతో పని చేశామనేదే ముఖ్యమన్నారు. ఉద్యోగి ఒత్తిడితో కాకుండా సంతోషంగా పనిచేస్తేనే సంస్థకు లాభమని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎల్ అండ్ టీ ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ కామెంట్స్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.