News September 12, 2025

ఆందోళన కలిగిస్తున్న గుండెపోటు మరణాలు!

image

గుండెపోటుతో సాధారణ ప్రజలే కాదు డాక్టర్లూ మరణిస్తున్నారు. ఆర్మీలో వైద్యుడిగా సేవలందిస్తోన్న మేజర్ విజయ్ కుమార్ (మధ్యప్రదేశ్) కూర్చున్న చోటే చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కారులో చాలాసేపు కదలకుండా కూర్చోవడం గమనించి పాదచారులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు. ఇటీవలే చెన్నైలోనూ ఓ కార్డియాలజిస్ట్ కూడా గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే.

Similar News

News February 6, 2026

చౌడు నేలల్లో పంటలకు యూరియా ఇలా వేస్తే మేలు

image

నేలలో ఉదజని సూచిక 7 కంటే ఎక్కువ ఉంటే ఆ నేలలను చౌడు నేలలుగా పరిగణిస్తారు. ఈ మట్టిలోని లవణాల శాతం ఎక్కువుగా ఉంటే భూసారం తగ్గి, మొక్కకు అవసరమైన పోషకాలు అందవు. అయితే ఈ చౌడు నేలల్లో పండించే పంటలకు యూరియాను తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేయడంతో పాటు యూరియాను పిచికారీ చేయాలి. నానో యూరియా వంటి ఎరువులను వాడటం వల్ల పంటల్లో మంచి దిగుబడి సాధించవచ్చంటున్నారు నిపుణులు.

News February 6, 2026

అవకాశం వచ్చినప్పుడు గెలిచి తీరాల్సిందే: సీఎం

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. మళ్లీ మళ్లీ పోటీ చేసే అవకాశం అందరికీ రాదని, పార్టీ టికెట్ ఇచ్చినపుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొడతాయని, మనం చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలని సూచించారు.

News February 6, 2026

బంగ్లాలో ఘర్షణలు.. యూనస్ ఇంటి బయటే..!

image

ఎన్నికలకు 6 రోజుల ముందు బంగ్లాలో ఘర్షణలు చెలరేగాయి. దేశ సలహాదారు యూనస్ నివాసం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నేషనల్ పే స్కేల్ అమలు చేయాలని దేశంలోని ఉద్యోగులు ఢాకాలోని షహీద్ మినార్ నుంచి యూనస్ నివాసానికి ర్యాలీగా వచ్చారు. లోనికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి, వాటర్ క్యానన్స్, టియర్ గ్యాస్, సౌండ్ గ్రనేడ్లు ప్రయోగించారు. ఢాకా అంతటా భారీగా బలగాలను మోహరించారు.