News July 5, 2024

సమంత పోస్ట్‌పై డాక్టర్ల ఫైర్.. ఖండించిన హీరో

image

సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినవారు ఇంట్లోనే హైడ్రోజన్-పెరాక్సైడ్‌ను పీల్చితే సరిపోతుందని హీరోయిన్ సమంత సలహా ఇచ్చారు. అయితే ఆ సలహా తప్పని, ఇలా చేస్తే చనిపోయే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించేలా చేయడం నేరమంటూ మండిపడుతున్నారు. కాగా ‘సమంత పోస్ట్‌లో ట్యాగ్ చేసిన డాక్టర్‌తో మీరు వాదిస్తే బాగుండేది’ అని ఓ డాక్టర్ చేసిన ట్వీట్‌కు హీరో రాహుల్ రవీంద్రన్ కౌంటర్ ఇచ్చారు.

Similar News

News March 20, 2026

‘బ్లూ డ్రమ్’ ప్లాన్.. భార్య స్కెచ్ చూసి భర్త షాక్!

image

భార్య ఫోన్‌లో తన ఫొటోకు ‘సిమెంట్ – డ్రమ్’ అనే క్యాప్షన్ చూసి భయపడిన భర్త ఆమెను ప్రియుడి వద్దకు పంపేశాడు. ఈ ఘటన UPలోని బులంద్‌షెహర్‌లో జరిగింది. గతఏడాది పుట్టింటి నెపంతో ఆరు నెలల బిడ్డను వదిలేసి ఓ నెల ప్రియుడితో గడిపిందని భర్త ఆరోపించాడు. నిలదీస్తే ఆధారాలు అడిగేదని.. ఇటీవల ఆమె ఫేస్‌బుక్ చెక్ చేస్తే హత్యకు కుట్ర పన్నుతున్న విషయం బయటపడిందని తెలిపాడు. తన ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించేదన్నాడు.

News March 20, 2026

TODAY HEADLINES

image

☛ ఏపీలో 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల
☛ ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు: CM CBN
☛ రైతును రాజును చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్
☛ తెలంగాణలో ఘనంగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం.. హాజరైన సీఎం రేవంత్, చిరంజీవి, కమల్ తదితరులు
☛ కవిత రాజకీయ పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’
☛ కొత్త శక్తికి, ఆరంభానికి ప్రతీక ఉగాది: మోదీ
☛ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

News March 20, 2026

కేరళంపై కమలం గురి – 1/2

image

కేరళంలో పాగా వేయాలని ఈసారి ప్రధాన కూటములు LDF, UDFతో పాటు BJP కూడా శ్రమిస్తోంది. పెరుగుతున్న ఓట్ షేర్‌ను సీట్లుగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 10.57%గా ఉన్న BJP షేర్ 2021లో 11.30%కు పెరిగింది. అప్పుడు NDAకి 2.55% తగ్గి 12.41% వచ్చినా వ్యక్తిగతంగా BJPకి ప్లసే అయింది. 2024 LS పోల్స్‌లో NDAకి 19.24% వచ్చింది. ఇందులో ఒక్క బీజేపీకే 16.68% (3.68%+) వచ్చింది. <<-se>>#Elections2026<<>>