News August 16, 2024
డాక్టర్ హత్యాచారం కేసు: సాయంత్రం మమత ర్యాలీ

పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ నేటి సాయంత్రం కోల్కతా వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తారని TMC MP డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. ర్యాలీకి ఈ కింది కారణాలను వివరించారు.
* ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు దర్యాప్తు వివరాలను రోజూ ఇవ్వాలి.
* ఈ కేసులో పోలీసులకు CM ఇచ్చిన తుది గడువు ఆగస్టు 17. CBIకీ ఇదే వర్తిస్తుంది.
* పోలీసులు ఒకర్ని అరెస్టు చేశారు. CBI నిందితులందర్నీ అరెస్టు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపాలి.
Similar News
News January 4, 2026
రెయిన్బో బేబీ అంటే ఏంటో తెలుసా?

వివిధ కారణాల వల్ల కొందరు పేరెంట్స్ ముందు బిడ్డను/బిడ్డలను కోల్పోతారు. ఆ తర్వాత పుట్టేవారిని రెయిన్బో బేబీ అంటారు. వైద్యులు ఈ రెయిన్బో బేబీస్ విషయంలో కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీరిని కొంతకాలం ఆసుపత్రిలో ఉంచాల్సి రావచ్చు. ఇంద్రధనస్సు అనేది వర్షం తర్వాత కనిపించే అందమైన రంగుల సమ్మేళనం. అలాగే ఈ బేబీస్ తల్లిదండ్రులకు కొత్త జీవితాన్ని, ఆనందాన్ని ఇస్తారు. అందుకే వారిని రెయిన్బో బేబీస్ అంటారు.
News January 4, 2026
విమానాల్లో పవర్ బ్యాంక్ వినియోగంపై నిషేధం

లిథియం బ్యాటరీల వల్ల అగ్నిప్రమాదాలు సంభవించే ముప్పు ఉండటంతో విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్ల ద్వారా ఛార్జింగ్ చేయడాన్ని DGCA నిషేధించింది. పవర్ బ్యాంకులు, పోర్టబుల్ ఛార్జర్లు విమానాల్లో మంటలకు కారణమయ్యే అవకాశం ఉందని తాజా సర్క్యులర్లో పేర్కొంది. ముఖ్యంగా వీటిని ఓవర్హెడ్ బిన్లలో ఉంచినప్పుడు పొగ లేదా మంటలను గుర్తించడం కష్టమవుతుందని, ఇది విమాన భద్రతకు పెను ప్రమాదమని హెచ్చరించింది.
News January 4, 2026
మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత

AP: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం MAR 3న మూసివేయనున్నట్లు TTD ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు క్లోజ్ చేయనున్నట్లు తెలిపింది. అన్ని ఆర్జిత సేవలనూ రద్దు చేసింది. ఆరోజు మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. అనంతరం ఆలయాన్ని శుద్ధి చేస్తారు. రాత్రి 8.30 గంటల నుంచి దర్శనాలు పునఃప్రారంభం అవుతాయని, భక్తులు గమనించాలని TTD కోరింది.


