News October 27, 2025
వైద్యురాలి ఆత్మహత్య.. సంచలన ఆరోపణలు

MHలో సూసైడ్ చేసుకున్న <<18107450>>వైద్యురాలిపై<<>> ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ‘గతంలో నా కూతురిని ఆమె భర్త అజింక్య(ఆర్మీ ఆఫీసర్), అత్తింటివాళ్లు చంపేశారు. కానీ సూసైడ్ చేసుకుందని లేడీ డాక్టర్ ఫేక్ పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చింది. ఆమెను ఎవరో ఒత్తిడి చేసినందుకే ఈ పని చేసింది. దీనిపై విచారణ జరపాలి’ అని పేర్కొన్నారు. కాగా SI గోపాల్‌తో పాటు ఓ MP తనను వేధించారంటూ సదరు వైద్యురాలు సూసైడ్ నోట్‌లో రాసిన విషయం తెలిసిందే.
Similar News
News October 27, 2025
మిరప ముంపునకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాల వల్ల పూత, కాత దశలో ఉన్న పచ్చిమిచ్చిలో శనగపచ్చ పురుగు, కాల్షియం లోపం, వేరుకుళ్లు సమస్యలు వస్తాయి. మిరపలో శనగపచ్చ పురుగు నివారణకు లీటరు నీటికి ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4గ్రా లేదా క్లోరాంట్రినిలిప్రోల్ 0.3mlను కలిపి పిచికారీ చేయాలి. కాల్షియం, ఇతర సూక్ష్మధాతు లోప నివారణకు లీటరు నీటికి ఆగ్రోమిన్ మాక్స్ (ఫార్ములా-6) 5 గ్రాములు, కాల్షియం నైట్రేట్ 5 గ్రాములను కలిపి 2-3 సార్లు పిచికారీ చేయాలి.
News October 27, 2025
భారీ వానలు.. మినుమును ఇలా రక్షించుకోండి

నంద్యాల, బాపట్ల, YSR, NTR, తూ.గో, కృష్ణా జిల్లాల్లో మినుము పంట విత్తు నుంచి కోత దశలో ఉంది. భారీ వర్షాలకు నీరు నిలిచి పంట కుళ్లిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్య నివారణకు ముందుగా పొలంలోని నీటిని తొలగించాలి. ఇనుముధాతు లోప సవరణకు ఫెర్రస్ సల్ఫేట్ 5గ్రా. సిట్రిక్ యాసిడ్ 0.5గ్రా. 20 గ్రాముల యూరియా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వారం తర్వాత 19:19:19 లేదా పొటాషియం నైట్రేట్ 1% పైరుపై పిచికారీ చేయాలి.
News October 27, 2025
భారీ వానలు.. మినుములో తెగుళ్ల నివారణ

భారీ వర్షాలకు మినుము పంటకు పలు తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. వేరుకుళ్లు, కోరినోస్పోరా ఆకు మచ్చ తెగులు నివారణకు హెక్సాకొనజోల్ 5SC 2 మి.లీ లేదా ప్రొపికొనజోల్ 25EC 1మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో మారుకా కాయ తొలుచు పురుగు నివారణకు వర్షాలు తగ్గిన వారం రోజులకు క్లోరిఫైరిఫాస్ 25EC 2.5 మి.లీ లేదా నోవాల్యూరాన్ 45 SC 1మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


