News October 12, 2025
జంతువులకు కూడా జ్యోతిషం వర్తిస్తుందా?

జ్యోతిషం అంటే భవిష్యత్తును చెప్పే శాస్త్రమే కాదు. కర్మ సిద్ధాంతాన్ని వివరించే దివ్య దర్శనం కూడా! ఈ శాస్త్రం జరగబోయే కష్టసుఖాలను తెలుపుతుంది. జీవులు ఏ రూపంలో ఉన్నా పాపపుణ్యాల మిశ్రమ ఫలితాలను పసిగట్టగలిగే శక్తి దీనికి ఉంది. అండజం(గుడ్డు నుంచి), పిండజం(గర్భం నుంచి), ఉద్భిజం(భూమి నుంచి) వంటి ఏ రూపంలో జన్మించినా, పుట్టుక నుంచి మరణం వరకు అనుభవించే కాలాన్ని, ఫలితాలను ముందే చెప్పగలదు. <<-se>>#Jyothisham<<>>
Similar News
News October 12, 2025
పిల్లలకు పోలియో చుక్కలు వేయించారా?

ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పల్స్ పోలియో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. HYDలో 0-5 ఏళ్ల పిల్లలకు 7AM-6PM వరకు ప్రత్యేక బూత్‌లలో, 13వ తేదీ నుంచి 15 వరకు ఇంటింటికి తిరిగి డ్రాప్స్ వేస్తామని కలెక్టర్ హరిచందన తెలిపారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల్లో పోలియో కేసులు పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా 290 జిల్లాల్లో ఈ డ్రైవ్ చేపట్టామని కేంద్రం వెల్లడించింది.
News October 12, 2025
నారద భక్తి సూత్రాలు – 6

‘యత్ జ్ఞాత్వా మత్తో భవతి, స్తబ్ధో భవతి, ఆత్మారామోభవతి’ అనే దివ్య వాక్యం భక్తి ఉన్నత స్థితిని వివరిస్తుంది. దేనిని తెలుసుకుంటే భక్తుడు నిశ్చలమైనవాడై ఆత్మలోనే ఆనందాన్ని పొందుతాడో అదే ‘భగవత్ ప్రేమ’. అది కల్గినవారికి లౌకిక విషయాలపై వ్యామోహం పోయి, మనసు స్థిరత్వం పొందుతుంది. భగవంతుడి జ్ఞానాన్ని పొందిన భక్తుడు, తన సంతోషం కోసం బాహ్య ప్రపంచంపై ఆధారపడకుండా, ఆత్మలోనే శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు. <<-se>>#NBS<<>>
News October 12, 2025
‘గాడ్ ఫాదర్’ నటి, ఆస్కార్ విన్నర్ కన్నుమూత

ఆస్కార్ నటి డయాన్ కీటన్(79) కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని నివాసంలో ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మరణానికి కారణాలు వెల్లడించలేదు. కీటన్ హాలీవుడ్ ఫేమస్ మూవీ ‘ది గాడ్ ఫాదర్’(1972) చిత్రంతో ‘కే ఆడమ్స్’ పాత్రతో ఆమె వెలుగులోకి వచ్చారు. సీక్వెల్‌లోనూ డయాన్ నటించారు. ‘ఆనీ హాల్’(1977) చిత్రంలో నటనకుగాను ఆస్కార్ అందుకున్నారు. దాదాపు 50ఏళ్ల పాటు సినిమాల్లో నటించారు.