News November 17, 2024
చికెన్ పులుసుతో జలుబు తగ్గుతుందా?

జలుబు చేసి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మసాలా దట్టించిన చికెన్ పులుసు కూర తినండి/సూప్ తాగండనే మాట తరుచూ వింటూ ఉంటాం. ఇందులో కొంత వరకు నిజం ఉందని నిపుణులు చెబుతున్నారు. కూరలో వాడే అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసుల కారణంగా కొంచెం ఉపశమనం కలుగుతుందని, ముక్కు రంధ్రాలు క్లియర్ అవుతాయని పేర్కొంటున్నారు. అయితే జలుబు పూర్తిగా మటుమాయం కాదంటున్నారు.
Similar News
News February 11, 2026
అంబటికి పీటీ వారెంట్.. జైలు నుంచి విడుదల మరింత ఆలస్యం

AP: YCP నేత అంబటి రాంబాబుకు సత్తెనపల్లి సివిల్ కోర్ట్ పీటీ వారెంట్ జారీ చేసింది. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల వేళ పెన్షన్ లబ్ధిదారుల నుంచి రూ.200 మినహాయించుకొని లక్కీ డ్రా టికెట్లు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై గత ప్రభుత్వ హయాంలోనే కేసు నమోదు కాగా తాజాగా పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేయగా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో అంబటిని రేపు కోర్టులో హాజరుపరచనున్నారు. ఫలితంగా ఆయన విడుదల ఆలస్యం కానుంది.
News February 11, 2026
భారత్ బంద్.. రేపు స్కూళ్లకు సెలవేనా?

కేంద్రం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు, కార్మిక సంఘాలు రేపు భారత్ బంద్ చేపట్టనున్నాయి. ఇది ప్రజారవాణాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు సెలవు ఉండనుందని ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. హెల్త్, ఫైర్ వంటి ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. అటు రేపటి బంద్‌లో పాల్గొనాలని PCCలను AICC ఆదేశించింది.
News February 11, 2026
2,273 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

SBI 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పొడిగించింది. ఫిబ్రవరి 18 ఆఖరుతేదీ కాగా.. ఫిబ్రవరి 25వరకు పెంచింది. డిగ్రీ ఉత్తీర్ణులై, వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి వయసులో సడలింపు ఉంటుంది. స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి. రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: sbi.bank.in


