News June 23, 2024

CM అంటే కటింగ్ మాస్టరా?: కేటీఆర్

image

TG: ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు కోతపెట్టడమే లక్ష్యమా? CM అంటే కటింగ్ మాస్టరా? అని KTR ఫైరయ్యారు. ‘మొన్న రూ.500 సిలిండర్, నిన్న 200 యూనిట్ల పథకాలకు లక్షల మందిని దూరం చేశారు. నేడు ₹2 లక్షల రుణమాఫీని ఎగ్గొట్టాలని చూస్తే ఊరుకోం. మొదట్లో ₹39 వేల కోట్లు అని ఇప్పుడు ₹31 వేల కోట్లకు కటింగ్ పెట్టారు. రేషన్ కార్డు, ఆదాయపు పన్ను సాకులుగా చూపి ప్రజలకు శూన్య హస్తం చూపితే ఊరుకోం’ అని Xలో హెచ్చరించారు.

Similar News

News October 9, 2024

ప్రముఖ నటుడు కన్నుమూత

image

ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు టీపీ మాధవన్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. తాజాగా ఆయన కొల్లంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. బహుముఖ పాత్రలకు పేరుగాంచిన మాధవన్ 600కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన 2016లో విడుదలైన ‘మాల్గుడి డేస్‌’లో చివరగా నటించారు.

News October 9, 2024

హరియాణాలో ఓవర్ కాన్ఫిడెన్స్‌ వల్లే ఓడిపోయాం: కాంగ్రెస్ మాజీ ఎంపీ

image

ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే హరియాణాలో ఓడిపోయామని కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎంపీ డీకే సురేశ్ అంగీకరించారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీ అంతర్గత యంత్రాంగం అలసత్వమే కొంప ముంచిందన్నారు. తమ అతిపెద్ద బలహీనత ఇదేనన్నారు. హైకమాండ్ త్వరలోనే దీనిపై సమీక్షిస్తుందని వెల్లడించారు. జమ్మూకశ్మీర్ ప్రజలు NC, కాంగ్రెస్ కూటమికి చక్కని తీర్పునిచ్చారని పేర్కొన్నారు. తమ కూటమి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

News October 9, 2024

నిర్వాసితులను ఒప్పించాకే బుడమేరు ప్రక్షాళన: పవన్

image

AP: విజయవాడ పరిధిలో బుడమేరు ప్రక్షాళనను పద్ధతిగా చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ముందుగా నిర్వాసితుల్లో అవగాహన పెంచుతామని చెప్పారు. నిర్వాసితులను ఒప్పించాకే బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని పేర్కొన్నారు. వారికి ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీనిచ్చారు.