News September 5, 2024
ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతులు నొక్కడమా?: కేటీఆర్
TG: తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్ట్ అక్రమమని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని ఎక్స్‌లో డిమాండ్ చేశారు. ‘ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతులను నొక్కడమేనా? ఇది రేవంత్ సర్కార్ అసమర్థతకు నిదర్శనం. అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చనుకుంటే అది మీ భ్రమే. రాష్ట్రంలో వాక్ స్వాతంత్ర్యం లేదు. నిరంకుశ పాలన సాగుతోంది’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News February 4, 2025
నేటి ముఖ్యాంశాలు
* AP: భారత్‌వైపే ప్రపంచ దేశాల చూపు: CM CBN
* ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు గడువు పొడిగింపు: లోకేశ్
* పద్మభూషణ్ నాలో ఇంకా కసిని పెంచింది: బాలకృష్ణ
* TG: కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్ధం: మంత్రి పొన్నం
* కులగణన నివేదిక ఫేక్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
* తెలంగాణలో 90 శాతం వెనుకబడిన వాళ్లే: రాహుల్ గాంధీ
News February 4, 2025
అప్పుడు రోహిత్.. ఇప్పుడు త్రిష
గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచాక భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్‌లో పడుకున్న ఫొటో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో అండర్-19 WC గెలుచుకున్నాక త్రిష కప్ పట్టుకొని పడుకున్న ఫొటోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది. దీంతో పాటు 2024లో సెలబ్రేషన్స్ ఫొటోలను ఇతర ఫొటోలతో పోల్చింది. అప్పటి రోహిత్ సెలబ్రేషన్స్‌ను ఇప్పుడు త్రిష రీక్రియేట్ చేశారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
News February 4, 2025
శ్రీవారి భక్తులకు అలర్ట్
AP: రేపు రథసప్తమి కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను సర్వదర్శనంలో అనుమతిస్తామని TTD EO శ్యామలరావు తెలిపారు. ఉ.5.30కు సూర్యప్రభ వాహన సేవతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఉ.9-10 వరకు చిన్న శేష వాహన సేవ, ఉ.11-12 వరకు గరుడ వాహన సేవ, మ.1-2 వరకు హనుమంత వాహన సేవ, మ.2-3 వరకు చక్రస్నానం, సా.4-5 వరకు కల్పవృక్ష వాహన సేవ, సా.6-7 వరకు సర్వభూపాల వాహన సేవ, రా.8-9 వరకు చంద్రప్రభ వాహన సేవతో వేడుకలు ముగుస్తాయి.