News March 17, 2025

టమాటా తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?

image

టమాటాలు తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయనే సందేహంపై ప్రముఖ వైద్యుడు సుధీర్ క్లారిటీ ఇచ్చారు. ‘టమాటాలు తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రభావం లేదు. టమాటాల్లో లైకోపీన్, బీటా కెరోటిన్/ విటమిన్ ఎ & సీ, పొటాషియం, ఫైబర్లు ఉంటాయి. కప్పు టమాటాలు 1 ½ – 2 గ్రాముల ఫైబర్‌తో 27 కేలరీలను కలిగి ఉంటాయి. అందుకే ఆరోగ్యకరమైన వ్యక్తి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. అయితే టమాటా కెచప్ ఆరోగ్యకరం కాదు’ అని తెలిపారు.

Similar News

News January 22, 2026

ఖమ్మం: ‘మాకు స్తోమత లేదు.. అక్కడే పూడ్చండి’

image

పొట్టకూటి కోసం వేలాది మైళ్ల దూరం నుంచి వచ్చిన ఆ వలస కూలీకి చివరకు సొంతూరి మట్టి కూడా కరవైంది. బిహార్‌కు చెందిన రాజన్‌రామ్‌ పందిళ్లపల్లి సమీపంలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, అంత దూరం వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లే స్తోమత తమకు లేదని వారు కన్నీరుమున్నీరయ్యారు. దీంతోఅన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు బుధవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

News January 22, 2026

గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

image

గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా దక్కించుకుంటానన్న <<18921246>>ట్రంప్<<>> సడన్‌గా రూట్ మార్చారు. ఫోర్స్ వాడనని ప్రకటించారు. ఆయన వెనక్కి తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఇవే అయి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 1.అమెరికా గ్లోబల్ ఇమేజ్ పాడవుతుందన్న భయం. 2.ప్రపంచ దేశాలన్నీ ఏకమై వ్యతిరేకించడం. 3.సైనిక దాడి చేస్తే NATO, UN రూల్స్ బ్రేక్ అవుతాయి. 4.మిత్రదేశాల మధ్య గ్యాప్ వచ్చే రిస్క్ ఉండటం. 5.USలోనే సపోర్ట్ లేకపోవడం.

News January 22, 2026

అభిషేక్ రికార్డు

image

టీమ్ ఇండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలనం సృష్టించారు. టీ20ల్లో అత్యంత వేగంగా 5వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచారు. 2,898 బంతుల్లోనే ఈ మార్కు చేరుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రసెల్(2,942), టిమ్ డేవిడ్(3,127), విల్ జాక్స్(3,196), గ్లెన్ మ్యాక్స్‌వెల్(3,239) ఉన్నారు. కేవలం అంతర్జాతీయ మ్యాచులే కాకుండా లీగ్స్, డొమెస్టిక్ మ్యాచులు ఇందులోకి వస్తాయి.