News July 17, 2024

బల్లి పడితే ఆహారం విషంగా మారుతుందా?

image

బల్లి పడితే ఆహారం విషంగా మారుతుందనేది అపోహ మాత్రమేనని BBC పేర్కొంది. బల్లుల్లో మనిషిని చంపేంత విషం ఉండదని పరిశోధనలు చెబుతున్నాయంది. అయితే బల్లి పడిన ఆహారాన్ని తీసుకున్నామనే అలర్జీ వల్లే వాంతులు, తలనొప్పి వస్తాయంది. ఈ సమస్యను మందులతో తగ్గించుకోవచ్చని వివరించింది. బల్లుల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని, అవి లేకపోతే కీటకాల సంఖ్య పెరిగి పరిస్థితి భయానకంగా మారుతుందని తెలిపింది.

Similar News

News November 25, 2025

అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

image

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.

News November 25, 2025

ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

image

ఐబొమ్మ రవి కస్టడీలో సహకరించలేదని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన తరఫు న్యాయవాది శ్రీనాథ్ తెలిపారు. మొత్తం ఆయనపై 5 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఒక్క కేసులో రిమాండ్ విధించారని, మిగతా కేసుల్లో అరెస్టు కోసం సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇవాళ రవి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనున్నట్లు పేర్కొన్నారు.

News November 25, 2025

తగ్గిన చమురు దిగుమతులు.. డిస్కౌంట్స్ ఇస్తున్న రష్యా కంపెనీలు

image

అమెరికా ఆంక్షల కారణంగా కొనుగోళ్లు పడిపోవడంతో రష్యా చమురు కంపెనీలు భారీగా రాయితీలు ఇస్తున్నాయి. జనవరికి డెలివరీ అయ్యే ఒక్కో బ్యారెల్ చమురుపై 7 డాలర్ల వరకు డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. రష్యా చమురు సంస్థలు రాస్‌నెఫ్ట్, ల్యూకోయిల్‌పై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించాయి. మరోవైపు, ఆ దేశం నుంచి కొనుగోళ్లు వద్దంటూ ఒత్తిడి చేస్తుండడంతో భారత రిఫైనరీలూ దిగుమతులు తగ్గించిన సంగతి తెలిసిందే.