News March 25, 2025
ఒళ్లంతా జ్వరం పట్టినట్టు ఉంటోందా…

వారం రోజులుగా చాలామంది శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు. తల తిరగడం, శరీరం తూలడం, కాళ్లు చేతులు లాగడం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధ పడుతున్నారు. ఒళ్లంతా జ్వరం పట్టినట్టే ఉంటోందని వాపోతున్నారు. వాతావరణం మారడం, ఎండలు పెరగడమే దీనికి కారణమని వైద్యనిపుణులు చెప్తున్నారు. డీహైడ్రేషన్కు గురవ్వకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. అవసరమైతే డాక్టర్ వద్దకు వెళ్లాలని చెప్తున్నారు. మీకూ ఇలాగే ఉంటోందా?
Similar News
News January 31, 2026
కోళ్లలో కొరైజా రోగ లక్షణాలు- జాగ్రత్తలు

కొరైజా రోగం సోకిన కోళ్లు సరిగా నీటిని, మేతను తీసికోక బరువు తగ్గుతాయి. కోడి ముక్కు, కళ్ల నుంచి నీరు కారుతుంది. కళ్లలో ఉబ్బి తెల్లని చీము గడ్డలు ఏర్పడతాయి. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశిస్తే అన్ని బ్యాచ్లకు ఈ రోగం వచ్చే ఛాన్సుంది. ఒక బ్యాచ్కు ఈ వ్యాధి వస్తే ఆ షెడ్డును కొన్ని రోజులు ఖాళీగా ఉంచాలి. సున్నం, గమాక్సిన్, బ్లీచింగ్ పౌడర్ కలిపి సున్నం వేయాలి. లిట్టరు పొడిగా ఉండేలా చూడాలి.
News January 31, 2026
IOCLలో 405 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News January 31, 2026
నేడు ఈ పనులు చేయకండి: పండితులు

శని దోష నివారణకు నేడు అనుకూలమైన రోజు. అందుకే నేడు ఎవరినీ నిందించకూడదు. అస్సలు అవమానించకూడదు. ముఖ్యంగా పనివారు, వృద్ధులు, పేదలను వేధించకూడదు. అలాగే ఇనుప వస్తువులు కొనడం నిషేధం. నల్ల నువ్వులు, నూనె వంటివి కూడా కొనుగోలు చేయకూడదట. ఆలయాలకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇంటి గడపపై కూర్చోవడం లేదా గడపను తొక్కడం వంటివి కూడా చేయరాదట.


