News March 16, 2024

కలిసొస్తుందా? ఖర్చు పెరుగుతుందా?

image

తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. గతంలో మాదిరి ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతాయని అంతా భావించగా.. అనూహ్యంగా ఈసీ మేలో పోలింగ్ తేదీ ప్రకటించింది. ఎన్నికల ప్రచారానికి ఈ గ్యాప్ తమకు కలిసి వస్తోందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రచారం, సభలు, కార్యకర్తలకు వసతి, ఆహారం సహా పలు అంశాల్లో ఖర్చు పెరుగుతుందనే ఆందోళన కూడా వారిలో ఉంది. మే 11 వరకు AP, TSలో ప్రచారం చేసుకోవచ్చు.

Similar News

News September 17, 2025

త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం: మంత్రులు

image

TG: త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తామని మంత్రులు సురేఖ, సీతక్క వెల్లడించారు. ‘కుటుంబ బాధ్యతలు, వృత్తి బాధ్యతల్లో మహిళలు నిత్యం ఒత్తిడులకు గురవుతున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కూడా చూసుకోవాలి. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈనెల 22న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం. మహిళల సూచనలతో కొత్త మహిళా పాలసీని తీసుకొస్తాం’ అని సెక్రటేరియట్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు.

News September 17, 2025

ఇకపై లక్కీ డిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు

image

శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లకు FIFO (First In First Out) స్థానంలో లక్కీ డిప్ విధానాన్ని TTD ప్రవేశపెట్టింది. టోకెన్లు 3 నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదల అవుతాయి. DEC టోకెన్ల కోసం SEP 18-20 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజూ (శుక్రవారం) 750 టోకెన్లు, శనివారాల్లో 500 టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు తిరిగి ఈ సేవ పొందేందుకు గడువు 180 రోజులుగా నిర్ణయించింది.

News September 17, 2025

మావోయిస్టుల సంచలన ప్రకటన.. ఆయుధాలు వదిలేస్తామని లేఖ

image

తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేసి, ఎన్‌కౌంటర్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. CPI మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ స్టేట్‌మెంట్ రిలీజైంది. కాగా అమిత్ షా 2026 మార్చి లోపు భారత గడ్డపై మావోయిస్టులను ఉండనివ్వబోమని డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. ఇది భద్రతా బలగాలకు అతిపెద్ద విజయం అని విశ్లేషకులు చెబుతున్నారు.