News July 22, 2024

జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నారేమో?: పవన్

image

AP: వైఎస్ జగన్‌కు ఇంకా తత్వం బోధపడలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ఇప్పటికీ తానే సీఎం అనుకుంటున్నారేమో? నెలరోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమారు. కుట్రలకు తెరలేపుతున్నారు. ఎల్లకాలం అధికారంలో ఉంటామనే భ్రమ నుంచి ప్రజలు బయట పడేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయానికి నేను, నా పార్టీ నూరు శాతం సహకరిస్తుంది’ అని తెలిపారు.

Similar News

News November 26, 2025

బెండ, టమాటా, వంగలో వైరస్ తెగుళ్ల నివారణ

image

కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టేందుకు రసం పీల్చే పురుగులను నివారించాలి. ఇందుకోసం ఫాసలోన్ లేదా ఫిప్రోనిల్ మందులను లీటరు నీటికి 2ML చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్ల దోమ నివారణకు 1.5గ్రా. ఎసిఫేట్‌ను లీటరు నీటికి కలిపి, కాయతొలుచు పురుగు నివారణకు 2ML ప్రొఫెనోఫాస్ లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. అలాగే అధికారుల సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వేసుకుని నీరు పెట్టుకోవాలి.

News November 26, 2025

భారత్ చెత్త రికార్డు

image

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో ఓడిన టీమ్ ఇండియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్టు క్రికెట్‌లో రన్స్ పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద పరాజయం. 2004లో 342(vsAUS), 2006లో 341(vsPAK), 2007లో 337(vsAUS), 2017లో 333(vsAUS) పరుగుల తేడాతో IND ఓడిపోయింది. తాజా ఓటమితో WTC 2025-27 సీజన్‌లో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. తొలి 4 స్థానాల్లో ఆసీస్, సౌతాఫ్రికా, శ్రీలంక, పాక్ ఉన్నాయి.

News November 26, 2025

ధర్మబద్ధమైన మార్గంలో నడిపించే నామం

image

విష్ణుం జిష్ణు మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ |
అనేకరూప దైత్యాన్తం నమామి పురుషోత్తమమ్ ||
జయశీలుడు, విశ్వమంతా వ్యాపించినవాడు, మహేశ్వరుడు, అనేక రూపాలలో దుష్టులను సంహరించినవాడు, ఉత్తమ పురుషుడైన ఆ విష్ణు దేవునికి భక్తితో నమస్కరించాలని ఈ శ్లోకం చెబుతోంది. ఫలితంగా శ్రీవారి అనుగ్రహంతో అనేక కష్టాలు, సవాళ్లను జయిస్తామని ప్రతీతి. ఈ విష్ణునామం మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుందని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>