News August 3, 2024
NEET PG ఔత్సాహికులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పనుందా?

తమ ఇళ్ల నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పరీక్ష కేంద్రాలను కేటాయించడంతో NEET PG ఔత్సాహికులు తీవ్ర నిరాశ చెందారు. దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యత నగరానికి బదులు దూరంగా ఉన్న కేంద్రాలను ఎలా కేటాయిస్తారని నెట్టింట ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో IMA జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసింది. చర్చలైతే విజయవంతంగా పూర్తయ్యాయని, అనుకూలంగా నిర్ణయం రావాలని కోరుకుందామని ఓ మెంబర్ తెలిపారు.
Similar News
News March 10, 2026
భారత్‌లో 53% పెరిగిన ఐఫోన్ల తయారీ

భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీ భారీగా పెరిగింది. గత ఏడాది ఇక్కడ 55 మిలియన్ ఐఫోన్లు తయారైనట్లు తెలుస్తోంది. అంతకుముందు ఏడాది 36 మిలియన్ ఐఫోన్లు తయారు కాగా 2025లో ఇది 53% పెరిగింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 220-230 మిలియన్ ఐఫోన్లు తయారు అవుతుండగా.. అందులో భారత్ వాటా ఇప్పుడు 25%కు చేరింది. US-చైనా ట్రేడ్ టెన్షన్స్ నేపథ్యంలో యాపిల్ ఇండియాలో తమ ఉత్పత్తులను పెంచుతున్నట్లు తెలుస్తోంది.
News March 10, 2026
ఈ ఇద్దరు MPలు జీతాలు తీసుకోవట్లే!

ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా చాలామంది పార్లమెంటేరియన్లు జీతాలు వదులుకునేందుకు ఇష్టపడట్లేదు. ప్రస్తుతం 18వ లోక్‌సభలో మొత్తం 543 మందిలో కేవలం ఇద్దరే జీతభత్యాలు తీసుకోవట్లేదని RTI ద్వారా తెలిసింది. హరియాణా BJP MP నవీన్ జిందాల్ జీతంతో పాటు అన్ని అలవెన్సులను వదులుకోగా కాంగ్రెస్ MP అంగోమ్చా బిమోల్ అకోయిజామ్(మణిపుర్) తన వేతనాన్ని నిరాకరించారు. పదవి ప్రజాసేవకే తప్ప సంపాదనకు కాదు అని వీరు నిరూపించారు.
News March 10, 2026
ఫైనల్లో గొడవ.. అర్ష్‌దీప్‌కు ICC ఫైన్

T20 WC ఫైనల్లో కివీస్ బ్యాటర్ మిచెల్‌పైకి బంతి విసిరిన ఘటనలో భారత బౌలర్ అర్ష్‌దీప్‌పై ICC చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. అర్ష్‌దీప్ ICC ప్రవర్తనా నియమావళి లెవెల్-1 ఉల్లంఘించారని పేర్కొంది. కాగా ఫైనల్ మ్యాచులో మిచెల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా అర్ష్‌దీప్ బంతి అందుకొని అతడిపైకి విసిరేయడంతో <<19332640>>గొడవ<<>> జరిగింది. తర్వాత మిచెల్‌కు అర్ష్‌దీప్ క్షమాపణ చెప్పారు.


