News June 28, 2024
సీఎంకు 986 మందితో భద్రత అవసరమా?: చంద్రబాబు

AP: రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి జగన్ అని సీఎం చంద్రబాబు ఫైరయ్యారు. ‘జగన్ చేసిన ఘోరాలు రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి. ఇది ఎన్నేళ్లు అనేది కాలమే నిర్ణయించాలి. జగన్కు 986 మంది పోలీసులతో భద్రత ఉండేది. అసలు సీఎంకు అంత భద్రత అవసరమా? ఇప్పుడు కూడా నేను వెళ్తుంటే అధికారులు పరదాలు కట్టేస్తున్నారు. ఇవన్నీ వద్దని చెప్పా. ఆలస్యమైనా ఫర్వాలేదు.. ట్రాఫిక్ ఆపొద్దని స్పష్టం చేశా’ అని పేర్కొన్నారు.
Similar News
News December 3, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

*ధాన్యం సేకరణలో రైతుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1967 ఏర్పాటు
*పోలవరం ప్రధాన డ్యామ్లో రూ.543 కోట్లతో చేపట్టే అదనపు పనులకు ప్రభుత్వం అనుమతి
*విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యోగుల జీతాల్లో కోత. 100% ఉత్పత్తి సాధిస్తేనే పూర్తి జీతాలు ఇస్తామని ప్రకటన. నేడు నిరసనకు కార్మికుల పిలుపు
*హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ డిమాండ్
News December 3, 2025
పశువుల్లో పాల ఉత్పత్తిని మరింత పెంచే గడ్డి ఇది

పశువుల్లో పాల ఉత్పత్తి పెరిగేందుకు చాలా మంది పాడి రైతులు సూపర్ నేపియర్ పశుగ్రాసం వాడుతున్నారు. ఇప్పుడు దీన్ని మించి అధిక ప్రొటీన్ శాతం కలిగి, పశువుల్లో పాల దిగుబడిని మరింత పెంచే ‘4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం’ అందుబాటులోకి వచ్చింది. నేపియర్తో పోలిస్తే చాలా మృదువుగా, 10-13 అడుగుల ఎత్తు పెరిగి, ఎకరాకు 200 టన్నుల దిగుబడినిస్తుంది. ఈ పశుగ్రాసం సాగు, ప్రత్యేకతల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 3, 2025
APPLY NOW: IIIT వడోదరలో ఉద్యోగాలు

IIIT వడోదర 7 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ట్రైనింగ్& ప్లేస్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు DEC 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(మేనేజ్మెంట్/ ఇంజినీరింగ్/LAW), CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.56,100- రూ.1,77,500 చెల్లిస్తారు. వెబ్సైట్: iiitvadodara.ac.in


