News March 16, 2024
ఓటరు కార్డు లేకున్నా పర్వాలేదు: సీఈవో

AP: ఎన్నికల్లో ఓటు కోసం దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందిస్తామని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు.
Similar News
News March 29, 2025
90 శాతం రాయితీ.. 2 రోజులే గడువు

TG: రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు రూ.1,010 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు పురపాలక శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి సెలవులు ఉన్నప్పటికీ పన్ను చెల్లించవచ్చని వెల్లడించింది. ఈ రెండు రోజుల్లో ఆస్తి పన్ను చెల్లించి వడ్డీపై 90 శాతం రాయితీ పొందొచ్చని పేర్కొంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.
News March 29, 2025
టాస్ గెలిచిన ముంబై

IPL: GTతో మ్యాచులో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
MI: రోహిత్, రికెల్టన్, సూర్య, తిలక్ వర్మ, హార్దిక్(C), నమన్ ధీర్, శాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, ముజీబ్, సత్యనారాయణ రాజు.
GT: గిల్(C), బట్లర్, సాయి సుదర్శన్, రూథర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, సాయి కిశోర్, రషీద్ ఖాన్, రబాడ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
News March 29, 2025
మెట్రో రైలు ప్రయాణ వేళలు పొడిగింపు

HYD మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉదయం 6 – రాత్రి 11.45 వరకు సర్వీసులు ఉంటాయని మెట్రో వెల్లడించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ టైమింగ్స్ అమలు చేస్తామని చెప్పింది. అలాగే టెర్మినల్ స్టేషన్ల నుంచి ఆదివారాల్లో మొదటి రైలు ఉ.7 గంటలకు ప్రారంభం అవుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం మెట్రో రైలు సర్వీసులు ఉ.6 నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటున్న విషయం తెలిసిందే.