News September 11, 2025
గృహ హింస కేసు.. హీరోయిన్‌కు నిరాశ

గృహ హింస కేసులో హీరోయిన్ <<15080954>>హన్సిక<<>>కు బాంబే హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 2021లో ముస్కాన్‌కు హన్సిక సోదరుడు ప్రశాంత్‌తో పెళ్లవ్వగా పలు కారణాలతో విడిపోవాలనుకున్నారు. అదే సమయంలో ప్రశాంత్‌తో పాటు ఆయన తల్లి జ్యోతి, హన్సిక తనను మానసికంగా వేధిస్తున్నారని ముస్కాన్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో హన్సిక, జ్యోతికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Similar News
News September 11, 2025
నా అంచనాలను అందుకొని బెస్ట్ ఇవ్వాలి: CBN

AP: ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. కొత్త కలెక్టర్లను నియమిస్తూ ఆయన మాట్లాడారు. ‘నా ఆలోచనలు, అంచనాలను అందుకొని, ఉత్తమ ప్రదర్శన చేయాలి. CM అంటే కామన్ మ్యాన్ అని చెబుతున్నా. మీరూ అదే పాటించాలి. అన్నింటికి రూల్స్‌తోనే కాకుండా మానవీయ కోణంలోనూ పనిచేయాలి. ఫేక్ ప్రచారాల పెను సవాళ్లను ఎదుర్కొంటూ రియల్ టైంలో స్పందించాలి. క్రియేటివ్, ఇన్నోవేటివ్ నిర్ణయాలు ఉండాలి’ అని తెలిపారు.
News September 11, 2025
ఈనెల 15 నుంచి చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డులు: మంత్రి

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 శాతం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘చివరి దశలో భాగంగా 9 జిల్లాల్లో ఈనెల 15 నుంచి పంపిణీ ప్రారంభిస్తాం. అక్టోబర్ 31 వరకు కార్డుల్లో మార్పులు, చేర్పులను ఉచితంగా చేసుకోవచ్చు. పొరపాట్లు ఉంటే గ్రామ/వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోండి. వాటిని సరిచేసిన తర్వాత ఉచితంగా కార్డులు అందిస్తాం’ అని ట్వీట్ చేశారు.
News September 11, 2025
తెలుగు రాష్ట్రాల్లో కోటీశ్వరులు ఎందరంటే?

గతేడాది ట్యాక్స్ రిటర్న్స్ డేటా ప్రకారం రూ.కోటి అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. మన దేశంలో అధికంగా మహారాష్ట్రలో 1,24,800 మంది కోటీశ్వరులున్నారు. ఆ తర్వాత యూపీలో 24,050, మధ్యప్రదేశ్‌లో 8,666, తమిళనాడులో 6,288 మంది ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 5,340, తెలంగాణలో 1,260 మంది ఉండటం గమనార్హం. ఇక లద్దాక్‌లో ముగ్గురు, లక్షద్వీప్‌లో ఒకరు మాత్రమే ఉన్నారు.