News September 12, 2025
నవంబర్‌లో భారత్‌కు డొనాల్డ్ ట్రంప్?

ఈ ఏడాది భారత్‌లో జరగబోయే క్వాడ్ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని యూఎస్ అంబాసిడర్ టు ఇండియా సెర్గీ గోర్ తెలిపారు. ఈ సమ్మిట్ కోసం ట్రంప్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా వచ్చే నవంబర్‌లో ఢిల్లీలో క్వాడ్ సదస్సు జరగనుంది. దీనికి భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్ నేతలు హాజరు కానున్నారు.
Similar News
News February 3, 2026
U19 WC.. ఫైనల్లోకి దూసుకెళ్లిన ఇంగ్లండ్

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత ENG 277/7 స్కోర్ చేయగా ఆసీస్ 47.3 ఓవర్లలో 250 పరుగులకే ఆలౌటైంది. రేపు రెండో సెమీస్‌లో ఇండియా, అఫ్గాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
News February 3, 2026
42% సీట్లు ఏవి?: పార్టీలకు BCల సెగ

TG: మున్సి‘పోల్స్’లో నామినేషన్లు ముగిశాయి. చాలా చోట్ల పార్టీ టికెట్ల కోసం గొడవలు జరిగాయి. స్థానిక సంస్థల్లో BCలకు 42% సీట్లు ఇస్తామన్న INC, BRS, BJPకి వారి నుంచి అసంతృప్తి సెగ గట్టిగానే ఉంది. అధికారిక 32% రిజర్వేషన్ సీట్లు సహా మిగతా వాటిని పార్టీ పరంగా ఇస్తామన్నాయి. ఇప్పుడేమో చేతులెత్తేశాయి. దీంతో BCల నుంచి నిరసన వస్తుండడంతో పార్టీలకు దిక్కుతోచడం లేదు. ప్రచారాల్లో ఏం చెప్పాలోనని తల పట్టుకున్నాయి.
News February 3, 2026
అసభ్యంగా తాకాడు.. చెంపపై ఒక్కటిచ్చా: నటి రేవతి సెన్సేషనల్ కామెంట్స్

80వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రేవతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన టీనేజ్ రోజుల్లో జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకున్నారు. ‘11వ తరగతి చదువుతున్నప్పుడు బస్సులో ప్రయాణిస్తుంటే ఒక వ్యక్తి అసభ్యంగా తాకాడు. అస్సలు భయపడకుండా వెంటనే అతణ్ని అందరి ముందే చెంపపై కొట్టా. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే భయపడకుండా ఎదురుతిరగమని మా అమ్మ ఇచ్చిన ధైర్యమే నన్ను అలా చేయించింది’ అని రేవతి పేర్కొన్నారు.


