News August 30, 2025
డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన రద్దు?

మోదీ చైనాలో పర్యటిస్తున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది భారత్‌లో జరగబోయే క్వాడ్ సమ్మిట్‌కు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. దీనిపై ఇంకా ఇరు దేశాలు స్పందించలేదని పేర్కొంది. కాగా వచ్చే నవంబర్‌లో ఢిల్లీలో క్వాడ్ సదస్సు జరగనుంది. దీనికి ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్ నేతలు హాజరు కావాల్సి ఉంది.
Similar News
News August 31, 2025
థాంక్యూ జగన్ గారు: అల్లు అర్జున్

AP: అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నమ్మ మరణించడం పట్ల మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ X వేదికగా సంతాపం తెలిపారు. ‘కనకరత్నమ్మ గారు మృతిచెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. దీనికి అల్లు అర్జున్ స్పందించారు. ‘థాంక్యూ జగన్ గారు. మీ మంచి మాటలు, మద్దతుకు చాలా సంతోషం’ అని కామెంట్ చేశారు.
News August 31, 2025
ఇటు కాళేశ్వరం.. అటు బీసీ రిజర్వేషన్లు!

TG: అత్యవసరంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ హాట్‌హాట్‌గా సాగనున్నాయి. కాళేశ్వరం నివేదిక, BC రిజర్వేషన్ల కొత్త బిల్లుకు ఆమోదం తెలపడం వంటి రెండు కీలక అంశాలపై సభలో చర్చ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికతో గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా, BC రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మల్చుకునేలా అధికార పార్టీ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొట్టాలని BRS భావిస్తోంది.
News August 31, 2025
ఫ్రీ బస్సు.. మరో శుభవార్త

AP: మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని గ్రౌండ్ బుకింగ్ ఉన్న బస్సుల్లో కూడా అనుమతించాలని ప్రభుత్వం RTCని ఆదేశించింది. కండక్టర్లు లేకుండా రెండు, మూడు బస్టాండ్లలో నడిచే బస్సులకు ఆయా బస్టాండ్‌లలోనే టికెట్లు ఇస్తుంటారు. ఇలాంటి పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల్లో ఇకపై మహిళలు ఉచితంగా వెళ్లవచ్చు. అలాగే సింహాచలం కొండతో సహా 39 ఘాట్ రోడ్లలో ప్రయాణించే బస్సుల్లోనూ ఈ స్కీం అమలుకు ఆదేశాలిచ్చారు.