News January 20, 2025
డొనాల్డ్ ట్రంప్ రికార్డులివే

US అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తున్న ట్రంప్ (78) పెద్ద వయస్కుడిగా రికార్డుల్లోకెక్కారు. గతంలో ఇది బైడెన్ పేరిట ఉండేది. క్రిమినల్ కేసులు ఉండి ప్రెసిడెంట్ అవుతున్న వ్యక్తీ ఈయనే. హష్‌మనీ కేసులో ట్రంప్ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. రెండుసార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొని ప్రజామద్దతు సంపాదించిన వ్యక్తిగా చరిత్రకెక్కారు. నాలుగేళ్ల విరామం తర్వాత అధికారం సాధించిన రెండో ప్రెసిడెంట్ ట్రంపే.
Similar News
News January 15, 2026
సేంద్రియ సాగుతోనే సక్సెస్

కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూర్లో బంజరు భూమిని పదేళ్లకు లీజుకు ఉమేష్ వ్యవసాయం ప్రారంభించారు. రెండు ఎకరాల్లో ఒకవైపు సాగును కంటిన్యూ చేస్తూ భూమిని సారవంతం చేసుకున్నారు. కోడి ఎరువు, మేక ఎరువు, ఆవు పేడ ఎరువును కలిపి నేలను సారవంతంగా మార్చారు. మార్కెట్ స్టడీ చేసి ఓడీసీ-3 వెరైటీ మునగ మొక్కలను నాటారు. ఇవి అనుకున్నట్టుగానే 3-4 నెలల్లోనే కాపుకు వచ్చి, ఆరు నెలల్లో మంచి దిగుబడి వచ్చింది.
News January 15, 2026
‘పెద్ద తప్పు చేశా.. కాపాడండి!’: పాక్ నుంచి సిక్కు మహిళ ఆవేదన

తీర్థయాత్ర కోసం పాక్ వెళ్లి అక్కడ పెళ్లి చేసుకున్న సరబ్‌జీత్ కౌర్ అనే భారతీయ మహిళ ఇప్పుడు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ‘నేను పెద్ద తప్పు చేశాను. ఇక్కడ నా పరిస్థితి బాలేదు. తిండికి, బట్టలకు కూడా ఇబ్బంది పడుతున్నాను. పిల్లల దగ్గరకు వచ్చేస్తా. నన్ను ఇక్కడ వేధిస్తున్నారు. దయచేసి ఇండియాకు తీసుకెళ్లండి’ అంటూ భారత్‌లో ఉన్న తన భర్తకు ఆమె పంపినట్లుగా చెబుతున్న ఆడియో క్లిప్ ఒకటి SMలో వైరలవుతోంది.
News January 15, 2026
ఇరాన్‌పై అమెరికా యుద్ధం?.. సిద్ధంగా డ్రోన్లు, విమానాలు!

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌లో నిరసనకారులపై జరుగుతున్న హింసను అడ్డుకుంటామని హెచ్చరించిన ట్రంప్.. ఇప్పుడు ప్రత్యక్ష సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలోని US స్థావరాల నుంచి వందలాది యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఎయిర్ ట్యాంకర్లు ఇరాన్ దిశగా కదులుతున్నట్లు తెలుస్తోంది. అటు ఇరాన్ కూడా ‘ప్రతీకార దాడులు తప్పవు’ అంటూ రివర్స్ వార్నింగ్ ఇచ్చింది.


