News August 2, 2024
సాటి కుక్కకు రక్తదానం.. ప్రాణం పోసిన శునకం
మనుషుల పట్ల విశ్వాసం చూపడమే కాదు సాటి కుక్కకు సాయం చేయడంలోనూ ముందుంటానని ఓ శునకం నిరూపించింది. కర్ణాటకలోని కొప్పళలో ల్యాబ్రడార్ జాతి కుక్క రక్తహీనతతో బాధపడుతోంది. దీనికి వెంటనే రక్తం ఎక్కించాల్సి ఉండటంతో డాబర్‌మేన్ కుక్కుల యజమానులను వైద్యులు సంప్రదించారు. భైరవ అనే ఓ కుక్క రక్తం సరిగ్గా సరిపోవడంతో దాని నుంచి 300ML సేకరించి, ల్యాబ్రడార్‌కు ఎక్కించారు. దీంతో అది ప్రాణాపాయం నుంచి బయటపడింది.
Similar News
News February 3, 2025
వచ్చే వారం 4 ఐపీవోలు
మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు ఈ నెల 4-10వ తేదీల మధ్య నాలుగు కంపెనీలు IPOకు రానున్నాయి. ఎలిగాంజ్ ఇంటీరియర్స్ రూ.78.07 కోట్లు, అమ్విల్ హెల్త్ కేర్ రూ.59.98 కోట్లు, రెడ్‌మిక్స్ కన్‌స్ట్రక్షన్ రూ.37.66 కోట్లు, చాముండా ఎలక్ట్రానిక్స్ రూ.14.60 కోట్లు సేకరించనున్నాయి. అలాగే డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్, మల్పాని పైప్స్ కంపెనీలు లిస్ట్ కానున్నాయి.
News February 3, 2025
జస్టిస్ చంద్రచూడ్ నివాసానికి మోదీ.. జస్టిస్ రాయ్ కీలక వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు మాజీ CJI జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజలో PM మోదీ పాల్గొనడంపై జస్టిస్ హృషికేష్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆ దృశ్యాలు కొంత కలవరపెట్టేలా కనిపించాయన్నారు. మీడియా కవరేజ్ లేకుండా కార్యక్రమం జరిగి ఉంటే ఆందోళన రేకెత్తేది కాదని చెప్పారు. చంద్రచూడ్ నిజాయితీపరుడని, కోర్టు వ్యవహారాలపై PMతో ఎప్పుడూ చర్చించలేదని పేర్కొన్నారు. కాగా జస్టిస్ రాయ్ నిన్న పదవీ విరమణ చేశారు.
News February 3, 2025
ఫిబ్రవరి 03: చరిత్రలో ఈ రోజు
✒ 1468: అచ్చుయంత్రాన్ని కనుగొన్న జోహన్నెస్ గుటెన్‌బర్గ్ మరణం
✒ 1938: బాలీవుడ్ నటి వహీదా రెహమాన్ జననం
✒ 1963: RBI 23వ గవర్నర్ రఘురాం రాజన్ జననం
✒ 1954: UP మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 800 మంది మృతి
✒ 2002: ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తి మరణం(ఫొటోలో)
✒ నేడు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం