News April 15, 2024

₹200 కోట్ల విరాళం.. ఇకపై భిక్షాటనతో జీవనం

image

గుజరాత్‌కు చెందిన దంపతులు రూ.200 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చారు. జైన మతానికి చెందిన పారిశ్రామిక వేత్త భవేశ్‌ భాయ్‌ భండారీ ఆయన భార్య ఇకపై సన్యాసం స్వీకరించి భిక్షాటనతో రోజువారీ జీవనం సాగించనున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉండగా వారు 2022లోనే సన్యాసం స్వీకరించారు. వారి నిర్ణయం ఈ దంపతులను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఏప్రిల్ 22న భవేశ్‌ భాయ్‌ దంపతులు సన్యాసం స్వీకరించనున్నారు.

Similar News

News October 16, 2024

ఐఏఎస్‌లకు హైకోర్టు షాక్

image

క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్‌లకు షాక్ తగిలింది. ఇలాంటి వ్యవహారంలో తాము జోక్యం చేసుకుంటే ముగింపు ఉండదని జడ్జి వ్యాఖ్యానించారు. ముందుగా వెళ్లి ఏపీలో రిపోర్ట్ చేయాలని ఐఏఎస్‌లను ఆదేశించారు. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం ఏపీలో రిపోర్ట్ చేయాలని క్యాట్ తీర్పునివ్వడంతో ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్, వాణీ ప్రసాద్, కరుణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

News October 16, 2024

MI బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే

image

ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే నియమితులయ్యారు. MI హెడ్ కోచ్ జయవర్దనే నేతృత్వంలో మలింగతో పాటు ఈయన బౌలింగ్ బాధ్యతలు చూసుకుంటారు. ముంబైకి చెందిన ఈ మాజీ పేస్ బౌలర్ 2024 టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమ్‌ ఇండియా కోచింగ్ స్టాఫ్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఈయన భారత్ తరఫున 2 టెస్టులు, 3 వన్డేలు ఆడారు.

News October 16, 2024

48 గంటల్లో 11 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్

image

బెంగళూరు ఆకాశ ఎయిర్ విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా దానిని ఢిల్లీకి మళ్లించారు. గత 48 గంటల్లో ఇలా నకిలీ బెదిరింపు కాల్స్ రావడం ఇది 11వ సారి. మంగళవారం 8, సోమవారం 2 వచ్చాయి. ఈ అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, DGCA అధికారులు వేర్వేరుగా సమావేశమయ్యారు. డార్క్‌వెబ్ ద్వారా ఈ కాల్స్ వస్తున్నాయని, కొందరు దోషుల్ని గుర్తించారని తెలిసింది.