News September 25, 2024
రూ.400 కోట్ల విరాళాలు వచ్చాయి: చంద్రబాబు

AP: విజయవాడలో వరద విపత్తు నుంచి చాలా తక్కువ సమయంలో బయటపడ్డామని సీఎం చంద్రబాబు తెలిపారు. NTR జిల్లా కలెక్టరేట్లో వరద బాధితులకు ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు రావడం ఒక చరిత్ర. విరాళాలు ఇవ్వాలన్న పిలుపుకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా స్పందించారు. పెద్ద విపత్తు వచ్చినప్పుడు నాతో పాటు 11 రోజులు ఉద్యోగులంతా నిర్విరామంగా పనిచేశారు’ అని సీఎం చెప్పారు.
Similar News
News October 17, 2025
హెల్మెట్ వాడకం తప్పనిసరి: ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్

ప్రపంచ ట్రామా డే సందర్భంగా ఏలూరులోని ఆశ్రమం ఆసుపత్రిలో శుక్రవారం హెల్మెట్ వాడకంపై ప్రత్యేక ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ప్రాణాపాయానికి ముఖ్య కారణం హెల్మెట్ ధరించకపోవడమేనని విచారం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఆయన కోరారు.
News October 17, 2025
బంగారం, వెండి కొంటున్నారా?

ధన త్రయోదశి సందర్భంగా రేపు బంగారం, వెండి కొనుగోలు చేయడం అత్యంత శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. అష్టైశ్వర్యాల అధినాయకురాలైన ధనలక్ష్మి కటాక్షం కోసం.. లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను కొని, పూజించాలని సూచిస్తున్నారు. ఈరోజున కొత్త వస్తువులు కొనుగోలు చేస్తే రాబోయే ఏడాదంతా ఆర్థిక ఇబ్బందులు కలగవని, సంపదకు లోటుండదని అంటున్నారు. ధనలక్ష్మి అనుగ్రహంతో కృపాకటాక్షాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
News October 17, 2025
రేపటి బంద్‌లో అందరూ పాల్గొనాలి: భట్టి

TG: BCలకు రిజర్వేషన్లపై నిర్వహించే బంద్‌లో అందరూ పాల్గొనాలని Dy.CM భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ‘BRS రిజర్వేషన్లను 50%కి పరిమితం చేసి BC కోటాను తగ్గించింది. మేం సైంటిఫిక్ సర్వే లెక్కల ప్రకారం 42% కల్పించాం. బిల్లును ఆమోదించి పంపినా కేంద్రం ఆమోదించడం లేదు. అందుకే రిజర్వేషన్ల పెంపు కోర్టుల్లో నిలిచిపోతోంది. BJP నైజం బయటపడింది. వారిప్పుడు మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరు’ అని భట్టి అన్నారు.