News September 23, 2025
నవరాత్రుల్లో చేయాల్సిన దానాలు – ఫలితాలు (2/2)

6. సరస్వతీ దేవి: విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం వల్ల విద్యాప్రాప్తి కలుగుతుంది.
7. దుర్గాదేవి: ఎర్ర చీర దానం చేస్తే విజయం లభిస్తుంది.
8. మహిషాసుర మర్దని: స్వయం పాకం దానం చేయడం వల్ల ధైర్యం పెరుగుతుంది. విజయం లభిస్తుంది.
9. రాజరాజేశ్వరీ దేవి: పూల మాలలు దానం చేయాలి. ఫలితంగా శక్తి, సౌభాగ్యం పెరుగుతుంది.
Similar News
News September 23, 2025
ఈ సీజన్‌లో రూ.లక్ష కోట్ల బిజినెస్!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ సైట్లలో ఇవాళ్టి నుంచి భారీ ఆఫర్లు మొదలయ్యాయి. దీంతో ఇండియాలోని ఈ సంస్థల ఆఫీసులు వార్ రూములను తలపిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఏకంగా 25లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 1.2ట్రిలియన్ సేల్స్ జరుగుతాయని టెక్ నిపుణుల అంచనా. మొత్తం రూ.లక్ష కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుందని సమాచారం. అర్ధరాత్రి నుంచే సేల్స్ విపరీతంగా జరుగుతుండటం విశేషం.
News September 23, 2025
వన్డేల్లో కోహ్లీ ఆడతారా? ఆడరా?

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో కొనసాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. వచ్చే నెలలో AUSతో వన్డే సిరీస్‌కు ముందు AUS-Aతో ODI సిరీస్‌లో ఆడాలని రోహిత్, కోహ్లీకి BCCI సూచించినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రోహిత్ ప్రాక్టీస్ మొదలెట్టగా, BCCIకి కోహ్లీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని సమాచారం. దీంతో ఆయన ఆడటంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం విరాట్ తన ఫ్యామిలీతో లండన్‌లో ఉంటున్నారు.
News September 23, 2025
YCP ప్రభుత్వంలో పెట్టిన తప్పుడు కేసులపై త్వరలో నిర్ణయం: అనిత

AP: గత ప్రభుత్వంలో రాజకీయ నేతలు, మీడియా, అమరావతి ఉద్యమకారులపై పోలీసులు పెట్టిన కేసులపై CM త్వరలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని హోంమంత్రి అనిత కౌన్సిల్‌లో ప్రకటించారు. ‘YCP ప్రభుత్వం 2019-24 మధ్య 3116 తప్పుడు కేసులు నమోదు చేసింది. న్యాయమడిగినా, తప్పులను ఎత్తి చూపినా కేసులు పెట్టారు. నాపైనా అట్రాసిటీ కేసు పెట్టారు’ అని పేర్కొన్నారు. న్యాయ, పోలీసు శాఖలతో చర్చించి వీటిని పరిష్కరిస్తామని తెలిపారు.