News November 27, 2024

కలియుగ దానకర్ణుడు.. వారెన్ బఫెట్ రూ.9300 కోట్ల విరాళం

image

వరల్డ్ బిలియనీర్ వారెన్ బఫెట్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 4 సంస్థలకు 1.1 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.9300 కోట్లు) డొనేట్ చేశారు. థాంక్స్ గివింగ్‌లో భాగంగా ఆయన ఇలాంటి విరాళాలు ఇస్తుంటారు. ఇక తన మరణానంతరం 147.4 బిలియన్ డాలర్లు వారసులకు ఎలా పంపిణీ చేయాలనే విషయమై బెర్క్‌షైర్ హాత్‌వే వాటాదార్లకు లేఖ రాశారు. అత్యంత సంపన్నుడైన బఫెట్ ఇప్పటికీ పాత ఇంట్లోనే ఉంటూ, సాధారణ కార్లలో ప్రయాణిస్తారు.

Similar News

News November 27, 2024

మతం మార్చుకుంటే రిజర్వేషన్లు వర్తించవు: సుప్రీంకోర్టు

image

రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మతంపై నమ్మకంతో మారితే తప్పులేదంది. బాప్టిజం తీసుకున్నాక హిందువుగా గుర్తింపు కొనసాగించలేరని చెప్పింది. హిందూమతాన్ని ఆచరిస్తుండటంతో ఉద్యోగంలో కోటా కోసం తనకు SC సర్టిఫికెట్ ఇవ్వాలని TN యువతి సెల్వరాణి వేసిన కేసును మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. దానిని సవాల్ చేయగా ఆ తీర్పు సరైందేనని సుప్రీంకోర్టూ తెలిపింది.

News November 27, 2024

మేం చెప్పినట్టు అదానీని అరెస్టు చేయాలి: రాహుల్ గాంధీ

image

అమెరికా DOJ అభియోగాలను అదానీ గ్రూప్ ఖండిస్తుందని ముందే ఊహించానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘అభియోగాలను అదానీ అంగీకరిస్తారని మీరు అనుకుంటున్నారా? కచ్చితంగా అలా చేయరు. అసలు పాయింట్ ఏంటంటే మేం చెప్పినట్టుగా ఆయన్ను అరెస్టు చేయడం. చిన్న చిన్న అభియోగాలకే వందలమంది అరెస్టయ్యారు. రూ.వేలకోట్ల వ్యవహారంలో ఆ జెంటిల్‌మన్ (అదానీ)పై US అభియోగాలు మోపింది. ఆయన జైల్లో ఉండాలి’ అని అన్నారు.

News November 27, 2024

BGT: రెండో టెస్టుకూ గిల్ దూరం?

image

చేతి వేలి గాయంతో BGT తొలి టెస్టుకు దూరమైన భారత బ్యాటర్ గిల్ రెండో టెస్టులోనూ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. 10-14 రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని అతడికి మెడికల్ స్పెషలిస్ట్ సూచించినట్లు BCCI వర్గాలు తెలిపాయి. రెండో టెస్టుకు ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచులో అతను అందుకే ఆడటం లేదని పేర్కొన్నాయి. థంబ్ ఫింగర్ ఇంజూరీ నుంచి కోలుకుని ఆడేందుకు టైమ్ పడుతుందని, మూడో టెస్టులోనూ ఆడేది అనుమానమేనని పేర్కొన్నాయి.