News January 25, 2025
బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దు: హైకోర్టు

TG: రాష్ట్రంలో సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉ.8.40 గంటల మధ్య ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని తెలిపింది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా టికెట్ రేట్ల పెంపుపై దాఖలైన పిటిషన్పై విచారించింది. రేట్ల పెంపు అనుమతులను రద్దు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.
Similar News
News January 18, 2026
నేవీలో క్యాడెట్ ఎంట్రీ స్కీమ్కు అప్లై చేశారా?

<
News January 18, 2026
కారణజన్ముడు ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు

AP: NTR కారణజన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి అని CM CBN అన్నారు. ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘‘సిని వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ‘అన్న’ NTR తరతరాల చరిత్రను తిరగరాశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టారు. రూ.2కే కిలో బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు తదితర పథకాలతో చరిత్ర గతిని మార్చారు’’ అని కొనియాడారు.
News January 18, 2026
X యూజర్లకు మస్క్ ₹9 కోట్ల ఆఫర్!

ఎలాన్ మస్క్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. ‘X’లో అత్యుత్తమంగా నిలిచే ఒక లాంగ్ ఫామ్ ఆర్టికల్కు ఏకంగా $1M (సుమారు ₹9 కోట్లు) బహుమతి ఇస్తామన్నారు. క్రియేటర్లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ కనీసం 1,000 పదాలు ఉండాలి. కంటెంట్ ఒరిజినల్ అయి ఉండాలి. AI వాడొద్దు. ప్రస్తుతానికి ఈ పోటీ జనవరి 28 వరకు అమెరికాలోని ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.


