News May 12, 2024
ఫేక్ ప్రచారాలను నమ్మకండి: చంద్రబాబు

AP: ఓటమి అంచుల్లో ఉన్నా వైసీపీకి బుద్ధి రాలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘ఇంకా ఫేక్ వీడియోలు, ఆడియోలు, పోస్టులతో జనాన్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డీప్ ఫేక్ ఆడియోలు, ఫేక్ లెటర్లు సృష్టిస్తున్నారు. ప్రజలెవరూ ప్రచారాలను నమ్మకండి. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు, ఎన్నికల అధికారులు తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News April 3, 2026
యుద్ధం.. అమెరికా ఆర్మీ చీఫ్‌పై వేటు

ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ర్యాండీ జార్జ్‌పై వేటుపడింది. వెంటనే పదవి నుంచి దిగిపోవాలని, రిటైర్మెంట్ తీసుకోవాలని డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఆదేశించారు. FBI డైరెక్టర్ కాష్ పటేల్, మరో ఇద్దరి తొలగింపుపైనా చర్చలు జరిగాయని వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. రక్షణ శాఖ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డజనుకు పైగా జనరల్స్, అడ్మిరల్స్‌ను హెగ్సెత్ తొలగించారు.
News April 3, 2026
అమ్మోరు/మశూచి వ్యాధిని కోళ్లలో ఇలా గుర్తించండి

మశూచి వ్యాధి సోకిన కోళ్ల ముక్కు, ముఖం, కంటి రెప్పలు, దవడల పైన బొబ్బలు వచ్చి ముక్కు నుంచి, కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. ఇది తక్కువ వ్యవధిలో ఇతర కోళ్లకు వ్యాపిస్తుంది. దీని వల్ల కోళ్ల మరణాలు తక్కువే ఉన్నప్పటికీ.. సరిగా మేత, నీరు తీసుకోలేవు. గుడ్లు పెట్టడం ఆగిపోతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. చర్మంపై కురుపుల్లో ఇతర సూక్ష్మక్రిములు చేరకుండా ఉండేందుకు పసుపు, వేపనూనె మిశ్రమాన్ని పూతగా పూయాలి.
News April 3, 2026
విద్యార్థులకు అలర్ట్.. 8 నుంచే పరీక్షలు

TG: రాష్ట్రంలో 1-9వ తరగతి విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA2) పరీక్షల షెడ్యూల్ మారింది. APR 10వ తేదీ నుంచి ఎగ్జామ్స్ పెట్టాలని భావించినా ఓపెన్ స్కూల్ పరీక్షల వల్ల 8వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. 1-7తరగతుల వారికి 9Am-11.30Am వరకు, 8వ తరగతికి 9Am-11.45Am, నైన్త్ విద్యార్థులకు 9Am-12Pm వరకు పరీక్షలు జరుగుతాయి. APR 23న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి 24 నుంచి సెలవులు ఇవ్వనున్నారు.


