News March 8, 2025
ఉద్యోగం ఇప్పిస్తామంటే నమ్మొద్దు:TGPSC

TG: అన్ని పరీక్షలనూ పారదర్శకంగా నిర్వహించామని TGPSC స్పష్టం చేసింది. ప్రతిభావంతులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నామంది. ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే నమ్మవద్దని, 9966700339 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అభ్యర్థులకు సూచించింది. కాగా ఈ నెల 10, 11, 14 తేదీల్లో గ్రూప్-1,2,3 <<15683630>>ఫలితాలు<<>> వెల్లడికానున్నాయి.
Similar News
News November 18, 2025
అగ్ర హీరోల నటగురువు కన్నుమూత

చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ కేఎస్ నారాయణస్వామి(92) కన్నుమూశారు. ఆయన మృతదేహానికి రజినీకాంత్ నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. సినీ వర్గాల్లో నారాయణస్వామి.. కేఎస్ గోపాలిగా సుపరిచితం. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాజర్, రాధా రవి వంటి ప్రముఖులకు నటనలో ఆయన పాఠాలు చెప్పారు. రజినీని డైరెక్టర్ బాలచందర్‌కు పరిచయం చేసింది కూడా ఈయనే.

AIతో 20 శాతానికి పెరగనున్న నిరుద్యోగిత: ఆంత్రోపిక్ CEO డారియో

ఉద్యోగ మార్కెట్‌పై AI ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఆంత్రోపిక్ CEO డారియో అమోడీ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో సగం ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ కనుమరుగయ్యే ఛాన్స్ ఉందన్నారు. భవిష్యత్తులో అన్‌ఎంప్లాయిమెంట్‌ను 10 నుంచి 20 శాతానికి పెంచుతుందని అంచనా వేశారు. కన్సల్టింగ్, లా, ఫైనాన్స్ వంటి ప్రొఫెషన్స్‌కూ రిస్క్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ రంగాల్లో AI మోడల్స్ బాగా పనిచేస్తున్నాయని చెప్పారు.