News May 18, 2024
బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దు: ఈసీ

AP: కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఈసీ ఆదేశించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయిల్ బంకుల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని బంకుల యజమానులకు నోటీసులు పంపింది. పోలింగ్ తర్వాత APలో పలుచోట్ల హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో EC ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
Similar News
News December 7, 2025
వీటిని తింటే కళ్లద్దాల అవసరమే రాదు

ప్రస్తుత రోజుల్లో చిన్నారులను సైతం కంటి చూపు సమస్యలు వేధిస్తున్నాయి. పోషకాహార లోపమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. రోజూ క్యారెట్, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, చిలకడదుంపలు తినిపిస్తే Vitamin A సమృద్ధిగా లభిస్తుంది. చేపలు, వాల్నట్స్, అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది. క్యాప్సికం, బ్రోకలీ వంటి ఆహారాలు కూడా కంటి నరాలకు మేలు చేస్తాయి.
News December 7, 2025
50 ఏళ్ల నాటికి సరిపోయేలా ‘ఒంటిమిట్ట’ అభివృద్ధి

AP: పురాతన ఒంటిమిట్ట కోదండ రామాలయం అభివృద్ధిపై TTD ప్రత్యేక మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తోంది. మరో 50 ఏళ్లలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించింది. వసతి, రవాణా, కల్యాణకట్ట, పుష్కరిణి, నక్షత్ర వనాలు, మ్యూజియమ్, ఉద్యానవనాలు, డిజిటల్ స్క్రీన్స్, కళామందిరం, 108Ft జాంబవంతుడి విగ్రహం, మాడ వీధుల అభివృద్ధి, CC కెమెరాలు వంటి వాటిపై EO సింఘాల్ అధికారులకు సూచించారు.
News December 7, 2025
RGSSHలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఢిల్లీలోని <


