News August 25, 2025

ఇష్టారీతిన బిల్డింగులు కట్టొద్దు: నారాయణ

image

AP: గత ప్రభుత్వంలో ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఇష్టమొచ్చినట్లు బిల్డింగ్స్ కట్టారని మంత్రి నారాయణ ఆరోపించారు. ‘ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ ఇప్పటికే ఇచ్చాం. బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్‌పై వర్క్ చేస్తున్నాం. నెలనెలా శాటిలైట్ పిక్చర్స్ స్టడీ చేసి.. ప్లానింగ్‌కి డీవియేషన్ ఉంటే CM చర్యలు తీసుకోమన్నారు. ఎవరైనా సరే డీవియేషన్ లేకుండా భవనాలు కట్టుకోండి. తేడాలుంటే ఇబ్బందులు పడతారు’ అని విజ్ఞప్తి చేశారు.

Similar News

News August 25, 2025

ఎంత ఒత్తిడి వచ్చినా పరిష్కారాన్ని కనుగొంటాం: మోదీ

image

US 50% టారిఫ్స్ ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో <<17512695>>PM మోదీ<<>> పరోక్షంగా స్పందించారు. ‘ఎంత ఒత్తిడి వచ్చినా దానికి పరిష్కారాన్ని కనుగొంటాం. నేడు ప్రపంచంలో ఆర్థిక స్వార్థంతో రూపొందుతోన్న విధానాలను చూస్తున్నాం. అలాంటి చర్యలను భారత్ వ్యతిరేకిస్తుంది. ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తాం. చిన్న పారిశ్రామికవేత్తలు, రైతులకు నష్టం జరగనివ్వం’ అని అహ్మదాబాద్‌లో ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

News August 25, 2025

లారీ కింద నలిగిపోయిన తండ్రీ కూతుళ్లు!

image

TG: ఊహించని ప్రమాదంలో ఒకేసారి తండ్రీ కూతుళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి(D) చేవెళ్లలో చోటుచేసుకుంది. గురుకుల స్కూలులో చదువుతున్న కూతురు కృప(12)ను తండ్రి రవీందర్(32) బైకుపై ఇంటికి తీసుకువస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొని వారి పైనుంచి వెళ్లింది. టైర్ల కింద నలిగిన వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రీ కూతుళ్ల మరణం స్థానికులను కంటతడి పెట్టించింది.

News August 25, 2025

కొరత ఉండదు.. ఆందోళన వద్దు: అచ్చెన్నాయుడు

image

APలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఖరీఫ్ కోసం 31.15 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేసి, ఇప్పటివరకు 21.34 లక్షల మె.టన్నులు సరఫరా చేశామ‌న్నారు. ప్రస్తుతం 6.22 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, 10,800 మెట్రిక్ టన్నులు ఒడిశా పోర్ట్ నుంచి దిగుమతి అవుతుందని, డిపోల్లోని 79,633 మెట్రిక్ టన్నులను అవసరమైన ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు.