News January 14, 2025

నన్ను ఆ పేరుతో పిలవకండి: తమిళ హీరో

image

తమిళ హీరో జయం రవి అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. ఇకపై తనను జయం రవి అని కాకుండా రవి లేదా రవి మోహన్ అని పిలవాలని కోరారు. జయం రీమేక్‌లో నటించడంతో ఆయన పేరు జయం రవిగా మారింది. ఈ క్రమంలో తనను పాత పేరుతోనే పిలవాలన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన కాదళిక్క నేరమిళై మూవీ ఇవాళ థియేటర్లలో విడుదల కానుంది.

Similar News

News November 16, 2025

కుమారుడి ఫస్ట్ బర్త్‌డే.. ఫొటో షేర్ చేసిన రోహిత్

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న తన కుమారుడు అహాన్ ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘సమయం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. కానీ ప్రతి క్షణాన్ని మేము ఆస్వాదిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News November 16, 2025

ibomma రవి: సీఈవో నుంచి పైరసీ దాకా..

image

పైరసీ మూవీ వెబ్‌సైట్ ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవి నిన్న అరెస్టయిన విషయం తెలిసిందే. అతడు గతంలో ER ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీకి CEOగా పని చేశాడు. ఐదేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నాడని, తర్వాత పైరసీ రంగంలోకి అడుగుపెట్టాడని తెలుస్తోంది. సర్వర్లను ఈజీగా హ్యాక్ చేయగలిగేలా పట్టు సాధించాడని సమాచారం. అయితే తనను పోలీసులు పసిగట్టరనే ధీమాతో విదేశాల నుంచి కూకట్‌పల్లికి వచ్చి దొరికిపోయాడు.

News November 16, 2025

‘వారణాసి’ గ్లింప్స్.. ఇవి గమనించారా?

image

రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ నుంచి రిలీజైన గ్లింప్స్ SMను షేక్ చేస్తోంది. 3.40 నిమిషాల నిడివి ఉన్న ఈ విజువల్ వండర్‌ను నెటిజన్లు డీకోడ్ చేసే పనిలోపడ్డారు. వారణాసి(512CE)లో మొదలయ్యే టైమ్ ఫ్రేమ్ వారణాసి(మణికర్ణికా ఘాట్)లోనే ముగుస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఫ్రేమ్‌లో ఎక్కడో ఒకచోట మహేశ్ కనిపించేలా వీడియో రూపొందించారని పేర్కొంటున్నారు. గ్లింప్స్ మీకెలా అనిపించింది?