News July 24, 2024
పారిస్ ఒలింపిక్స్‌లో కరోనా వచ్చినా డోంట్ కేర్!

ప్యారిస్‌లో ఒలింపిక్స్ పోటీల ఆరంభానికి ముందే ఆస్ట్రేలియా వాటర్ పోలో క్రీడాకారిణి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే, 2020 టోక్యో ఒలింపిక్స్ వలే అథ్లెట్లను నిర్బంధించట్లేదని, కఠినమైన ప్రోటోకాల్‌లు లేవని ఆస్ట్రేలియా ఒలింపిక్ టీమ్ చీఫ్ అన్నా మీరెస్ తెలిపారు. కోవిడ్ ఉన్నప్పటికీ శిక్షణ పొందుతున్నారని, వారికి ప్రత్యేక గది కేటాయిస్తారని చెప్పారు. ఐసోలేషన్ పీరియడ్లు ఉండవని పేర్కొన్నారు.
Similar News
News January 26, 2026
దూడలలో తెల్లపారుడు వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?

తెల్లపారుడు వ్యాధిని కలిగించే ఇ.కోలి క్రిమి సహజంగా దూడ పేగులలో ఉంటుంది. దూడలు అపరిశుభ్రమైన పొదుగు లేదా పాత్రలలో పాలు తాగినప్పుడు, ఒక్కసారిగా ఎక్కువగా పాలు తాగినప్పుడు, వెన్న ఎక్కువగా ఉన్న చివరి పాలు తాగినప్పుడు, పాలు తాగే సమయాలలో తేడా ఉన్నప్పుడు, జున్నుపాలు సరిగా తాగనప్పుడు, దూడల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు.. దూడ పేగుల్లోని హానికర ఇ.కోలి సంఖ్య పెరిగి తెల్లపారుడు వ్యాధి కలుగుతుంది.
News January 26, 2026
NTPCలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News January 26, 2026
పుట్టింట్లో ఒడిబియ్యం ఎందుకు పోస్తారు?

పెళ్లి తర్వాత తనవారికి దూరమై కొత్త జీవితం ప్రారంభించే వధువుకు ఆ దూరం వల్ల కలిగే బాధ వర్ణనాతీతం. ఆ తల్లిదండ్రుల, కుమార్తె మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఈ ‘ఒడిబియ్యం’ సంప్రదాయం. ఆ బంధం ఎప్పటికీ నిలిచి ఉండాలని, కూతురుని మళ్లీ మళ్లీ ఇంటికి పిలిపించి చూసుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. మనసారా ఆశీర్వదించి ఆమెకు ఇష్టమైన దుస్తులు, పసుపు-కుంకుమ ఇచ్చి గౌరవించడమే ఈ ఆచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.


