News May 13, 2024

మొబైల్ ఫోన్లు తేవొద్దు: CEO

image

AP: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (CEO) ముకేశ్ కుమార్ మీనా విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రైల్వే కళ్యాణ మండపంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించమని, ఎవరూ తీసుకురావొద్దని కోరారు. పలుచోట్ల ఘర్షణలు తలెత్తిన విషయం తమ దృష్టికి వచ్చిందని, చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Similar News

News March 13, 2026

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం

image

AP: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా చండీగఢ్‌కు చెందిన జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి హాలులో ఆమె చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏప్రిల్ 24న CJ పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపడతారు. దీంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా చరిత్రకెక్కనున్నారు.

News March 13, 2026

42 ఏళ్లు కోమాలో ఉన్న అరుణ గురించి తెలుసా?

image

12 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీశ్ రాణా(32) కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు ఇటీవల <<19352489>>అనుమతిచ్చింది.<<>> ఈ తీర్పునకు ముంబైకి చెందిన నర్సు అరుణా షాన్‌బాగ్ కేసు స్ఫూర్తి. 1973లో ఆమెను రేప్ చేసి దాడి చేయడంతో 42 ఏళ్లపాటు కోమాలో ఉండి 2015లో చనిపోయారు. 2009లో ఆమె కారుణ్య మరణం కోసం ఓ జర్నలిస్టు పిల్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే 2011, 2018, 2023లో వెలువడిన తీర్పులు కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేశాయి.

News March 13, 2026

కారుణ్య మరణంపై 2011, 2018 తీర్పులు ఏం చెప్పాయి?

image

సరైన రక్షణ చర్యలు, స్థానిక హైకోర్టు ఆమోదంతో <<19352489>>కారుణ్య మరణానికి<<>> చట్టబద్ధత ఉంటుందని 2011లో సుప్రీం వెల్లడించింది. కోలుకోవడం సాధ్యం కానప్పుడు లైఫ్ సపోర్టును తొలగించవచ్చని, దీనిపై పార్లమెంటులో చట్టం చేయాలని సూచించింది. ఆర్టికల్ 21 గౌరవప్రదంగా జీవించే హక్కుతోపాటు గౌరవప్రదంగా మరణించే హక్కునూ కల్పిస్తుందని 2018లో పేర్కొంది. 2023లో పలు సవరణలతో కారుణ్య మరణంపై తుది తీర్పు వెలువడింది.