News June 27, 2024

రోడ్లు సరిగా లేకుంటే టోల్ వసూలు చేయొద్దు: గడ్కరీ

image

నాణ్యమైన సేవలు అందించనప్పుడు టోల్ వసూలు చేస్తే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రహదారులు సరిగా లేకుంటే టోల్ ఛార్జీలు వసూలు చేయొద్దని హైవే సంస్థలకు సూచించారు. ‘మనం టోల్ వసూలుపై చాలా ఆత్రుతతో ఉన్నాం. కానీ రోడ్లు సరిగా ఉన్న చోటే ఫీజులు వసూలు చేయాలి. గుంతలు, మట్టితో ఉండే అధ్వానమైన రోడ్లకు టోల్ వసూలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది’ అని తెలిపారు.

Similar News

News April 8, 2026

ఈ సారి ఎన్నికలు అలా జరగవు.. TMCకి EC మెసేజ్!

image

వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘నేరుగా TMCకి ECI ఇస్తున్న సందేశమిది. ఈ ఎన్నికలు భయం, హింస, బెదిరింపులు, ఛప్పా(నకిలీ ఓట్లు), బూత్ జామింగ్ (పోలింగ్‌ను అడ్డుకోవడం), సోర్స్ జామింగ్(ఓటర్లను అడ్డుకోవడం) లేకుండా జరుగుతాయి’ అని పేర్కొంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్నాయి. మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి.

News April 8, 2026

పవనే ఫస్ట్ ప్రపోజ్ చేశారు: అన్నా లెజ్నెవా

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా ఇన్‌స్టాలో ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవనే తనకు మొదట ప్రపోజ్ చేశారని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే తనకు మొత్తం 6 భాషలొచ్చనీ, కానీ ఇంగ్లిష్‌లో మాట్లాడటం సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. తనకు తెలుగు అంటే చాలా ఇష్టమని, రోజూ కొంత నేర్చుకుంటున్నట్లు వెల్లడించారు.

News April 8, 2026

అమెరికా-ఇరాన్ సీజ్‌ఫైర్‌.. మోదీపై కాంగ్రెస్ ఫైర్

image

అమెరికా-ఇరాన్ సీజ్‌ఫైర్‌లో పాకిస్థాన్ పాత్ర ఉండటంపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇది మోదీ దౌత్య విధానాలకు పెద్ద ఎదురుదెబ్బ అని అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాక్‌ను ప్రపంచం నుంచి దూరం చేయాలన్న ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయని విమర్శించారు. దివాలా తీసిన ఒక విఫల దేశం అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి ప్రాధాన్యం దక్కించుకోవడం మోదీ ఫెయిల్యూర్ అని మండిపడ్డారు.