News April 18, 2024
చంద్రబాబు మాదిరి ‘గ్రాఫిక్స్’ చూపి మోసం చేయం: బొత్స

AP: రాజకీయాల్లో చంద్రబాబుకు, ఊసరవెల్లికి తేడా లేదని, స్టేజీ మారితే ఆయన మాట మారుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. TDP చీఫ్ మాదిరి గ్రాఫిక్స్ చూపించి మోసం చేసే ప్రభుత్వం తమది కాదన్నారు. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో భోగాపురం ఎయిర్పోర్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. విశాఖ మెట్రో రైలు DPR రెడీ అయ్యిందని చెప్పారు. వైజాగ్ పరిపాలనా రాజధానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
Similar News
News November 23, 2025
HYD: సైబర్ నేరాలపై ప్రతిజ్ఞ చేయించిన సీపీ

సైబర్ నేరాల నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీపీ సజ్జనార్ అన్నారు. శనివారం చార్మినార్ ప్రాంగణంలో ‘జాగృత్ హైదరాబాద్- సురక్షిత్ హైదరాబాద్’ పేరుతో సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోసపూరిత లింక్ను ఓపెన్ చేయబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930, సైబర్ పోర్టల్ www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.
News November 23, 2025
న్యూస్ అప్డేట్స్

⋆ నేడు పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు.. పాల్గొననున్న AP CM చంద్రబాబు, తెలంగాణ CM రేవంత్
⋆ నేడు రాప్తాడుకు YCP అధినేత జగన్.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరు
⋆ HYDలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు.. సీతాఫల్మండి నుంచి చిలకలగూడ వరకు యూనిటీ మార్చ్లో పాల్గొననున్న కిషన్ రెడ్డి. రాంచందర్ రావు
News November 23, 2025
పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

AP: పశ్చిమగోదావరి డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్ 11 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ (సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్), BCA, B.Ed, MSc, MSW ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://westgodavari.ap.gov.in/


