News July 3, 2024

టీషర్ట్‌, టోన్డ్ జీన్స్‌తో కాలేజీకి రావొద్దు!

image

టీషర్ట్‌, టోన్డ్ జీన్స్‌ కాలేజీకి రావొద్దని ముంబైలోని చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషనల్‌ సొసైటీ విద్యార్థులకు హుకుం జారీ చేసింది. విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో వస్తే అనుమతించమని స్పష్టం చేసింది. గతనెలలో ఇదే సొసైటీ కళాశాల ప్రాంగణంలో హిజాబ్‌, బుర్ఖా, నకాబ్‌, టోపీలపై నిషేధం విధించింది. దానిపై పలువురు విద్యార్థులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. నిషేధాన్ని హైకోర్టు సైతం సమర్థించింది.

Similar News

News July 5, 2024

కవిత జుడీషియల్ రిమాండ్‌ పొడిగింపు

image

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో ఈనెల 18 వరకు రిమాండ్‌ను పొడిగించింది.

News July 5, 2024

రోహిత్ శర్మకు ‘స్వీట్ హోమ్’ వెల్‌కమ్

image

టీ20 వరల్డ్ కప్‌తో స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు తన ఇంట్లో స్వీట్ వెల్‌కమ్ లభించింది. ఇంటి నిండా పూలు చల్లి ఆయనను కుటుంబసభ్యులు ఆహ్వానించారు. రోహిత్‌ను హత్తుకుని తమ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా నిన్న ముంబైలో జరిగిన ఓపెన్ టాప్ బస్ పరేడ్ అనంతరం రోహిత్ నేరుగా తన నివాసానికి వెళ్లారు.

News July 5, 2024

విక్టరీ పరేడ్‌లో తప్పిపోయిన పిల్లలు!

image

‘విక్టరీ పరేడ్’లో పాల్గొనేందుకు ముంబైలోని మెరైన్ డ్రైవ్‌కు లక్షల మంది హాజరయ్యారు. T20WC ట్రోఫీతో భారత జట్టు ప్రయాణిస్తోన్న బస్సు తమవద్దకు రాగానే ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో చాలా మంది పిల్లలు వారి తల్లిదండ్రుల నుంచి తప్పిపోయారు. దాదాపు డజను మంది తప్పిపోయిన పిల్లలు మెరైన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు సురక్షితంగా వారి పేరెంట్స్ వద్దకు చేరినట్లు సమాచారం.