News July 16, 2024
నైట్ ఫుడ్ కోర్టులకు ఇబ్బంది కలిగించొద్దు: సీఎం రేవంత్

HYDలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్లు, SPలతో సమావేశంలో CM రేవంత్ స్పష్టం చేశారు. ‘మానవ అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. నేరస్థులతో కాకుండా బాధితులతో పోలీసులు ఫ్రెండ్లీగా ఉండాలి. HYDలో రాత్రిపూట ఫుడ్ కోర్టులకు ఇబ్బంది కలిగించవద్దు. డ్రగ్స్ నియంత్రణకు పోలీస్, ఎక్సైజ్ శాఖలు కలిసి పనిచేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా ఉండాలి’ అని సీఎం సూచించారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


