News January 20, 2025
భోజనం తర్వాత ఈ రెండూ చేయకండి

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగొద్దు. ఎందుకంటే మనం తినే సమయంలో పొట్టలోకి జీర్ణరసాలు వచ్చి ఆహారం డైజెస్ట్ అయ్యేలా చేస్తాయి. తినగానే నీళ్లు తాగితే ఈ రసాలు పలుచబడి జీర్ణ ప్రక్రియ ఆలస్యం అవుతుందనేది డాక్టర్ల సూచన. ఇక రాత్రి మోతాదుగా, తేలిక ఆహారం, అది కూడా పడుకునే 2-3 గంటల ముందు తింటే మంచిది. తిన్న అరగంట లోపు పడుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి లైట్ యాక్టివిటీ ట్రై చేయండి.
Similar News
News November 18, 2025
చెరకు సాగుకు భూమి తయారీ – సూచనలు

చెరకును నాటడానికి 4 వారాల ముందే పశువుల గెత్తం లేదా కంపోస్ట్ ఎరువును ఎకరానికి 10 టన్నుల చొప్పున వేసి భూమిలో కలియదున్నాలి. బరువు నేలల్లో 5-6 టన్నులు వేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద వంటి వాటిని పెంచి నేలలో కలియదున్నాలి. పచ్చిరొట్ట పంటలు భూమికి చేర్చడం వల్ల పంటకు భాస్వరం లభ్యత పెరగడమే కాకుండా, భూమికి నీటిని నిలుపుకునే శక్తి పెరిగి పంట బాగా ఎదగడానికి దోహదపడుతుంది.

ఉద్యోగుల పనితీరుపై కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ కన్ను

IT సంస్థలు హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులతో పనిచేయిస్తున్నాయి. అయితే వారి పనితీరు తెలుసుకొనేలా ‘Cognizant’ ‘ప్రో-హాన్స్ స్టైల్’ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టింది. ఇది మౌస్ను ట్రాక్ చేస్తుంటుంది. 300 సెకండ్లు కదలకపోతే ఐడల్గా, 15 ని.లు మించితే దూరంగా ఉన్నట్లు తెలుపుతుంది. వాడే అప్లికేషన్లనూ గుర్తిస్తుంది. కాగా ఇది సిబ్బంది పనితీరును అంచనా వేయడానికి కాదని, వినియోగం తెలుసుకొనేందుకేనని కంపెనీ చెబుతోంది.