News August 30, 2024
శివాజీ విషయంలో రాజకీయాలు చేయొద్దు: షిండే

శివాజీ విగ్రహాన్ని పునర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. శివాజీ విషయంలో రాజకీయాలు చేయొద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. రాజ్కోట్లో 35 అడుగుల శివాజీ విగ్రహం కూలిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో ఛత్రపతి పాదాలను 100 సార్లు తాకేందుకు సిద్ధంగా ఉన్నానని, క్షమాపణలు చెప్పేందుకు వెనుకాడనని చెప్పారు.
Similar News
News November 18, 2025
హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలపై సంధ్య కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఎవరి అనుమతితో కూల్చివేశారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు పట్టించుకోలేదని సీరియస్ అయ్యింది. ఈ కేసులో తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
News November 18, 2025
అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ అరెస్ట్

హరియాణా ఫరిదాబాద్లోని అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్ధిఖీని మనీలాండరింగ్ కేసులో ED అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడు, టెర్రర్ మాడ్యూల్ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న వర్సిటీ సహా 25 ప్రాంతాల్లో ED సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించింది. ఈక్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకుంది. కాగా వర్సిటీలో పనిచేసిన ముగ్గురు డాక్టర్లకు ఉగ్ర కుట్రతో సంబంధాలున్నాయన్న కోణంలో విచారణ జరుగుతోంది.
News November 18, 2025
తరాలకు మార్గదర్శకంగా సత్యసాయి బాబా జీవితం: మోదీ

AP: రేపు పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నానని పీఎం మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం సత్యసాయి జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. సత్యసాయి బాబాతో సంభాషించడానికి ఆయన నుంచి నేర్చుకోవడానికి కొన్ని అవకాశాలు తనకు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే సచిన్ పుట్టపర్తికి చేరుకున్నారు.


